YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

హిందూపురం
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన సతీమణి వసుంధర తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ భార్య వసుంధరా దేవి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. ఒక రకంగా బాలయ్య తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. బాలకృష్ణ హయాంలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని వసుంధరా దేవి చెప్పారు. హిందూపురం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తాగునీటి ప్లాంట్లు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే  ఆస్పత్రిని అభివృద్ధి చేసినట్లు వసుంధర గుర్తు చేశారు. అలాగే మొబైల్ ఆరోగ్య సేవలు, క్యాన్సర్ చికిత్స అందించిన ఘనత బాలకృష్ణదేనని తెలిపారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఇప్పటికీ కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా మరోసారి ఆయన విజయం సాధించడం పక్కానని వసుంధర ధీమా వ్యక్తం చేశారు. హిందూపురం నుంచి బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీనని ఆమె తెలిపారు.

Related Posts