YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉస్మానియా ఫౌండేషన్ భవనానికి శంకుస్థాపన

ఉస్మానియా ఫౌండేషన్ భవనానికి శంకుస్థాపన

హైదరాబాద్
ఉస్మానియా ఫౌండేషన్ భవన్ కు ఓయూలో ఓయూ విసి ప్రో. రవీందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరొక మైలు రాయికి ఈరోజు బీజం పడిందని అన్నారు. 106 సంవత్సరాల చరిత్రలో కొంతమంది కృషి వల్ల అలుమిని అసోసియేషన్ ఆక్టీవిటి జరుగుతుంది అన్నారు. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా జరిగింది కానీ అది కార్యరూపం దాల్చలేదు. మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్న 21 పాయింట్ ఏజెండాలో భాగంగా వచ్చే 10 సంవత్సరాలలో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. అందులో భాగంగానే ఉస్మానియా ఫౌండేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా భారత దేశంలో, ప్రపంచంలోని పూర్వ విద్యార్థుల నుండి ఫండ్స్ సేకరించి వాటిని వివిధ రూపాలలో యూనివర్సిటీ అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. ఈ ఫండ్స్ కు టాక్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నారు. ఈ ఫౌండేషన్ కు ఎవరైతే విరాళాలు అందిస్తారో వారి యొక్క పేర్లను ఆయా బిల్డింగులకు, ఆయా రూములకు పేరు పెట్టడం జరుగుతుంది.

Related Posts