YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చేతిలో చిల్లిగవ్వ లేదు బీజేపీపై మల్లిఖార్జున ఖర్గే ఆరోపణలు

చేతిలో చిల్లిగవ్వ లేదు బీజేపీపై మల్లిఖార్జున ఖర్గే ఆరోపణలు

బెంగళూరు, మార్చి 14
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రచారం కోసం ఖర్చు పెట్టేందుకు ఒక్క రూపాయి కూడా లేదని ఆ పార్టీ వాపోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. పార్టీకి సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాల్నీ బీజేపీ ఫ్రీజ్ చేయించిందని ఆరోపించారు. ఐటీ డిపార్ట్‌మెంట్ కావాలనే తమ బ్యాంక్ అకౌంట్స్‌ని నిలిపివేసిందని మండి పడ్డారు. భారీ జరిమానాలు చెల్లించాలని నోటీసులు పంపారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన ఖర్గే...వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అన్ని పార్టీలకూ ఉంటుందని, కానీ బీజేపీ కుట్రపూరితంగా తమ బ్యాంక్ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేయించిందని, ఇన్‌కమ్ ట్యాక్స్ పేరు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో జరిగిన అవకతవకల్ని బయట పెట్టే ధైర్యం లేని బీజేపీ తమని మాత్రం ఇలా ఇబ్బంది పెడుతోందని ఫైర్ అయ్యారు. "మాకు వచ్చిన ప్రతి రూపాయి ప్రజలు ఇచ్చిందే. విరాళాల రూపంలో మాకు వచ్చిన డబ్బే అదంతా. కానీ బీజేపీ ఆ నిధుల్ని పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు ఖర్చు పెట్టడానికి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అటు బీజేపీ మాత్రం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత మొత్తంలో విరాళాలు వచ్చాయో చెప్పడానికి వెనకడుగు వేస్తోంది. వాళ్ల మోసాలు బయట పడతాయని భయపడుతోంది. అందుకే జులై వరకూ సమయం కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
గతంలో చేసిన తప్పులే మళ్లీ చేయొద్దని, కాంగ్రెస్‌ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఖర్గే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలబురగి నుంచి పోటీ చేసిన మల్లికార్జున్ ఖర్గే బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి ఇక్కడి ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని కోరారు. ఈ సారి ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. "ఈసారి కూడా మోసపోకండి. బీజేపీ వాళ్లంతా మోసగాళ్లే. అబద్ధాలు చెబుతారు. నిజాలు దాచిపెట్టి అబద్ధాలనే వ్యాప్తి చేస్తారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని అంబేడ్కర్ చెప్పారు. రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో స్వేచ్ఛ అనేదే ఉండదు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
మ‌హిళ‌ల‌ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ..ప‌లు రాష్ట్రాల్లో ఇదే వ్యూహంతో అధికారంలోకి వ‌చ్చింది. తెలంగాణ‌లోనూ ఆర్టీసీ బ‌స్సు ఉచిత ప్ర‌యాణం పేరుతో మెజారిటీ మ‌హిళ‌ల అభిమానం పొందింది. క‌ర్ణాట‌క‌లోనూ మ‌హిళ‌లకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఉద్యోగాలు చేసే మ‌హిళ‌ల‌కు ఉచిత క్యాబ్ సౌక‌ర్యం అందిస్తోంది. రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇదే వ్యూహం అమలు చేయాలని భావిస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లాంటి చరిష్మా ఉన్న నాయ‌కుడిని ఢీ కొట్టి నిలబ‌డాలంటే..మ‌హిళ‌ల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ దిశ‌గానే ఎన్నిక‌ల మేనిఫెస్టోను రూపొందిస్తున్న‌ట్టుతెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా మొత్తం 5( పంచ‌) కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించింది. మహాలక్ష్మి, ఆది అబది, శక్తి కా సమ్మాన్, అధికార్ మైత్రీ, సావిత్రీబాయి పూలే హాస్టల్స్ పథకాలు హామీల్లో చేర్చింది.

Related Posts