YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యువతను మోసం చేసి చంపేశారు...

యువతను మోసం చేసి చంపేశారు...

విజయవాడ, మార్చి 15
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర యువతను మోసం చేసి.. వారి ఆశలు చంపేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో నిజాయతీ గల వ్యక్తులను ఛైర్మన్ గా నియమించామని.. ఇప్పుడు ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని మండిపడ్డారు. 'ప్రజా సేవ చేయాలని ఎంతో మంది యువత కలలు కంటారు. అందులో భాగంగానే గ్రూప్స్ పరీక్షలను ఎంచుకుంటారు. జగన్ సర్కారు ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టింది. రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టునే తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. నీతి నిజాయతీ ఉన్న వ్యక్తిని కమిషన్ ఛైర్మన్ గా నియమించాలి. ఆలిండియా సర్వీసులు ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసులూ అంతే ముఖ్యం. ఒకప్పుడు నమ్మకంగా ఉన్న ఏపీపీఎస్సీ ఇప్పుడు అపనమ్మకంగా మారింది. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపడ్డి బయటకు పంపారు. సీఎం జగన్ కు అనుకూలంగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను నియమించారు. ప్రస్తుతం కమిషన్ లో అనుభవం లేని వారు ఛైర్మన్ గా, సభ్యులుగా ఉన్నారు.' అంటూ చంద్రబాబు విమర్శించారు.2018లో జరిగిన గ్రూప్ - 1 పరీక్షల వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. 'గ్రూప్ - 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవినీతి రాజ్యమేలింది. గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ అయ్యాక దురాలోచనకు తెరలేపారు. వాల్యుయేషన్ ను దాచిపెట్టి మళ్లీ రెండోసారి చేశారు. రెండో మూల్యాంకనం జరగలేదని కోర్టుకు చెప్పారు. అలా జరిగింది అనడానికి ఆధారాలు ఇస్తున్నాం. డిజిటల్ వాల్యూయేషన్, మాన్యువల్ వాల్యుయేషన్ అంటూ రకరకాలుగా చేశారు. ఓసారి మూల్యాంకనం అయ్యాక రెండోసారి ఎలా చేస్తారు.?. మాన్యువల్ వాల్యుయేషన్ కు వచ్చిన వారి కోసం రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఆవాస రిసార్డ్ కు ఈ మొత్తం చెల్లించినట్లుగా బిల్లులున్నాయి. స్ట్రాంగ్ రూం వద్ద భద్రతకు కర్నూలు నుంచి కానిస్టేబుళ్లను తీసుకొచ్చారు. ఎన్నో ఆశలతో పరీక్షలు రాసిన నిరుద్యోగ యువత పట్ల క్రూర మృగాల కంటే ఘోరంగా వ్యవహరించారు. మూల్యాంకనం ప్రక్రియలో బరితెగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని చూశారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారు. అందుకు తగ్గట్టుగా ఛైర్మన్ స్థాయిలో గౌతమ్ సవాంగ్ సహకరించారు. సలాంబాబు, సుధాకర్ రెడ్డి, సుధీర్ వంటి వారిని సభ్యులుగా నియమించారు. పిల్లల జీవితాలు, తల్లిదండ్రుల కలలను నాశనం చేశారు. గ్రూప్ - 1 అభ్యర్థులు చందాలు వేసుకుని న్యాయం కోసం పోరాడారు. ఐదేళ్ల తర్వాత వారికి న్యాయం జరిగింది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts