YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మామ అల్లుళ్లు మధ్య సవాళ్లు

మామ అల్లుళ్లు మధ్య సవాళ్లు

గుంటూరు, మార్చి 16
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో పగలు సెగలు రేగుతున్నాయి. మామా – అల్లుళ్ళ మధ్య మాటల యుద్దం మొదలు కాకముందే మంటల్లో కార్యాలయాలు మండిపోతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాకముందే రెండు పార్టీల కార్యకర్తలు తమ తడఖా చూపిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా భాష్యం ప్రవీణ్‌ను ప్రకటించారు. రెండో జాబితాలో భాష్యం ప్రవీణ్ పేరు రావడంతోనే రెండు పార్టీల్లో అలెర్ట్ మొదలైంది. టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటిని కాదని భాష్యం ప్రవీ‌ణ్‌కు అవకాశం కల్పించారు అధినేత చంద్రబాబు నాయడు. దీంతో అధిష్టానం తీరుపై కొమ్మాలపాటి అలకబూనారు. ఇది ఇలా ఉండగానే భాష్యం ప్రవీణ్ నియోజకర్గంలో అడుగు పెట్టడానికి ముందే అతని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. క్రోసూరు మండలం దోడ్లేరు, అనంతవరం వద్ద ఇప్పటికే భాష్యం ప్రవీణ్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి కొందరు దుండగులు వాటిని చించి వేశారు. మరో వైపు భాష్యంను అభ్యర్థిగా ప్రకటించిన రోజే అమరావతిలో టీడీపీ కార్యకర్తులు సైకిల్ వదిలి ఫ్యాన్ కిందకు చేరిపోయారు.భాష్యం ప్రవీణ్ ప్లెక్సీలు చించి వేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేశారు. పెట్రోల్ పోసి తగులబెట్టడంతో కార్యాలయం అగ్నికి ఆహూతయ్యింది. అయితే ఇద్దరూ టీడీపీ కార్యకర్తలే మద్యం మత్తులో తగులబెట్టారని అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి కాలిపోయిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నంబూరు పరిశీలించారు., ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు, టీడీపీ ఇంచార్జ్ భాష్యం ప్రవీణ్‌లు వరుసకు బంధువులు. ఎమ్మెల్యే అన్న అల్లుడే భాష్యం ప్రవీణ్. ఇద్దరిది తుళ్లూరు మండలం పెద్ద పరిమి గ్రామమే. ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే. దీంతో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ద్వారా నంబూరు రాజకీయ ఆరంగ్రేటం చేస్తే, వచ్చే ఎన్నికల్లో పోటీకి భాష్యం టీడీపీ ద్వారా సిద్దమయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కొమ్మాలపాటి టీడీసీ అభ్యర్ధిగా గెలుపొందితే 2019లో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారే అయిన నంబూరు శంకర్ రావు వైసీపీ అభ్యర్ధి విజయం సాధించారు.వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులే బరిలోకి దిగుతుండటంతో విజయం ఎవరిని వరిస్తుందో అని ఇప్పటినుండే చర్చ మొదలైంది.

Related Posts