YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వాజేడు లో మద్యం సిండికెట్ కిక్కు - దారి పొడగునా బెల్ట్ షాపుల దర్శనం

వాజేడు లో మద్యం సిండికెట్ కిక్కు   - దారి పొడగునా బెల్ట్ షాపుల దర్శనం

ములుగు జిల్లా వాజేడు మండలంలో మద్యం షాపుల నిర్వాహకులకి ఆబ్కారీ శాఖ అధికారుల అండదండలు పుష్కళంగా ఉండటంతో మద్యం వ్యాపారుల ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.మండలంలో ఎప్పుడు లేనంతగా మద్యం షాపు నిర్వాహకుల ఆగడాలు మితిమీరి పోయాయని అధికారులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు.వాజేడు నుండి  మద్యం  ఒక్కో క్వాటర్, బీర్ల బాటిల్ పై 20 నుండి 30 రూపాయలు అధికంగా వసూల్ చేస్తూ ఛత్తిస్ ఘర్ రాష్ట్రానికి మద్యం తరలి వెళ్తున్న దాఖలాలు ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు.మద్యం షాపుల యజమానులు సిండికెట్ అవ్వడం వలన మద్యం షాపులని వారు నిర్ణయించిన సమయంలో తెరిచి వారికి ఇష్టమైన సమయంలో మూయడం మద్యం మొత్తం మండలంలోని బెల్ట్ షాపులకి తరలించడం వలన పేద, మధ్య తరగతి కుటుంబాలకి చెందిన మద్యం ప్రియులు ఒక్కో మద్యం బాటిల్ పై 30 నుండి 50 రూపాయలు అధికంగా చెల్లించి తాము కష్టపడి సంపాధించినదంత బెల్ట్ షాపులకే దారపోయాల్సి వస్తుందని ఈ కారణంగా వారి కుటుంబాల్లో గోడవలకి సైతం దారి తీస్తున్నాయి.వాజేడు మండలంలో మండపాక నుంచి మొదలు చంద్రుపట్ల వరకు దారి పొడగునా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిసి రాత్రి పగలు అనే తేడా లేకుండా మద్యం అమ్మకాలు జరగడంతో  మందుబాబుల కిక్కు ఎక్కువ అయి గొడవలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి.ఇప్పటికైనా నూతన తెలంగాణా ప్రభుత్వం బెల్ట్ షాపుల ను తొలగించి సంబంధిత శాఖాధికారులను తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
 

Related Posts