YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ నిరసన

బీఆర్ఎస్ నిరసన

మేడ్చల్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడి అధికారులు చేసిన అరెస్ట్ ఖండిస్తూ, పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీల్జాధిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్వర్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేఖంగా నిరసనలు వ్యక్తం చేస్తూ మోడీ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేసారు. కవిత అనైతిక అరెస్ట్ ని కందిస్తు, కేంద్రంలోని మోడీ, రాష్ట్రం లోని కేడి కలిసి కట్టుగా బీఆర్ ఎస్ పై కుట్ర పన్నారని ఆరోపించిన మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.మోడీ వచ్చే ముందు ఈడి వస్తుందని ఎద్దేవా చేసారు... గత ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్ లు బీఆర్ ఎస్ పై కుట్రలు పన్నారని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మళ్ళీ బీజేపీ కాంగ్రెస్, బీఆర్ ఎస్ పై కుట్రలో భాగంగానే కవితని అరెస్ట్ చేశారని జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts