YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెండు రాష్ట్రాలకు వాటాల లెక్కలు..

రెండు రాష్ట్రాలకు వాటాల లెక్కలు..

విజయవాడ, మార్చి 18
పదేళ్లకు దిల్లీలోని ఏపీ భవన్ విభజనకు మోక్షం కలిసింది. ఏపీ భవన్‌ను విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలిపింది. అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణ వాటాగా 8.245 ఎకరాలు, ఏపీ వాటాగా11.536 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయిస్తూ నిర్ణయించారు. అలాగే ఏపీకి నర్సింగ్ హాస్టల్‌లో 3. 359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.దిల్లీలో తెలుగువారికి చిరునామాగా నిలిచే ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఎట్టకేలకు పూర్తైంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవడంతో రెండు తెలుగురాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తాజాగా ఏపీ భవన్ విభజనపై కేంద్రహోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు. దిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది.విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ భవన్ విభజన పూర్తైందని తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేసిందన్నారు. త్వరలోనే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు అనుగుణంగా దిల్లీలో తెలంగాణ భవన్(నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Related Posts