YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మియాపూర్ లో చెడ్డీ గ్యాంగ్

మియాపూర్ లో చెడ్డీ గ్యాంగ్

హైదరాబాద్, మార్చి 18
హైదరాబాద్ నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. గతంలో నగరంలోని ఒకట్రెండు చోట్ల చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడంతో హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరు నిందితులు శనివారం అర్ధరాత్రి మియాపూర్ లోని వరల్డ్ వన్ స్కూల్ లో  చోరీ చేశారు. స్కూల్ కౌంటర్ లో ఉంచిన 7 లక్షల 85 వేల నగదును చెడ్డీ గ్యాంగ్ ముఠా దోచుకెళ్లింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్కూల్ లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.
మియపూర్ సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మీడియా సమావేశంలో చెడ్డి గ్యాంగ్ అప్డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 16న ఓ స్కూల్‌లో అర్ధరాత్రి చోరీ జరిగిందని ఫిర్యాదు వచ్చింది. వారి వేషధారణ అంతా చెడ్డి గ్యాంగ్‌లా ఉన్నారు. స్కూల్ లోని కౌంటర్‌లోకి చొరబడి రూ.7 లక్షల 85 వేల నగదును దోచుకెళ్లారుదొంగతనం దృశ్యాలు స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ఒంటిమీద బట్టలు లేకుండా చెడ్డీలతో దొంగలు వచ్చారు. మొత్తం ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. స్కూలు యాజమాన్యం లో పనిచేసే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అని కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. నిందితుల కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాం. గతంలో కూడా చెడ్డీ గ్యాంగ్ ఈ ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా ఉండడంతో మియాపూర్ ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ’ సీఐ పేర్కొన్నారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన ఆయన సూచించారు.

Related Posts