బాపట్ల
బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద ఉన్న 16వ నెంబరు జాతీయ రహదారిపై ఈరోజు యుద్ద విమానాలు ల్యాండింగ్ ట్రయలును ఎయిర్ ఫోర్స్ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర సమయాలు, ప్రకృతి విపత్తుల సమయంలో యుద్ద విమానాలు ఈ హైవే పై ల్యాండ్ అయ్యేందుకు అనువుగా రనేవే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల పై 13 ప్రాంతాల్లో ఇలా ఎయిర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కోరిశపాడు వద్ద ఉన్న జాతీయ రహదారితో పాటు సింగరాయకొండ వద్ద కూడా నిర్మించారు. ఇక గత ఏడాదిలో కూడా ఇక్కడ ఒకసారి యుద్ద విమానాల ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే అప్పుడు విమానాలు 100 మీటర్ల ఎత్తులో చక్కెరలు కొట్టాయి తప్ప ల్యాండ్ కాలేదు. ఇప్పుడు మాత్రం 4 సుఖోయ్ యుద్ద విమానాలు రనేవే కు అత్యంత తక్కువ ఎత్తులో ఎగరగా, కార్గో యుద్ద విమానం మాత్రం రన్వే పై విజయవంతంగా ల్యాండ్ అయింది. విమానాలకు అవసరమైన రాడార్ వ్యవస్ధను ఎయిర్ ఫోర్స్ అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసారు. మరోవైపు ట్రయల్ రన్ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుండే పోలీసులు ట్రాఫిక్ మళ్ళీంపు చర్యలు చేపట్టారు.