నంద్యాల
నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో వైసీపీ ఖాళీ అయిందన్నారు ఈ సందర్భంగా చాపిరేవుల వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ఉప సర్పంచ్ బిజ్జల బాలస్వామి రెడ్డి , అతని కుమారుడు బిజ్జల శేఖర్ రెడ్డి మరియు అతని అనుచరులు మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఫరూక్ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వానికి కౌన్ డౌన్ ప్రారంభం అయిందని ప్రజలు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని చీ కొడుతున్నారని అధికారంలోకి రాకముందుకు ఎన్నో హామీలు ఇచ్చిన ఈ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 30% హామీలను కూడా నెరవేర్చలేకపోయిందన్నారు గ్రామాలను , టౌన్ లను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు . గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చాపిరేవులను చాలా అభివృద్ధి చేశామని రోడ్లు , కాలువలు , మంచినీటి సౌకర్యం లాంటి పనులు ఎన్నో చేశామన్నారు కానీ ఈ వైఎస్ఆర్సిపి చాపిరేవులలో అభివృద్ధి పనులు చెయ్యలేక చేతులెత్తేసిందన్నారు కావున ప్రజలందరూ గమనించి 2024లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా నంద్యాల ఎమ్మెల్యేగా ఫరూక్ ని గెలిపించుకోవాలన్నారు. మళ్లీ చాపిరేవులకు పూర్వవైభవం తీసుకొని వచ్చే బాధ్యత నాది అని ఫరూక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాపిరేవుల గ్రామ ప్రజలు పాల్గొన్నారు