YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సోషల్ మీడియాలో పోస్టుతో ఇబ్బందులే

సోషల్ మీడియాలో పోస్టుతో ఇబ్బందులే
టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ల పై వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్న వ్యక్తుల పై చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు దుర్వినియోగం అవుతున్నాయి.  స్వేచ్ఛ ఉంది కదాయని ఏది పడితే అది రాస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. గతంలోనే తమ చేతల ద్వారా ఇదే సంగతి చెప్పింది. ఇప్పుడు అదే పని చేస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జి. శ్రీనివాస్‌రెడ్డి వైఎస్సార్‌ సానుభూతిపరుడిగా ముద్రపడ్డారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ టీడీపీకి వ్యతిరేకంగా పోస్ట్ లు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో వేలల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఫలితంగా  కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన పై ఫిర్యాదు వచ్చింది. శ్రీనివాసరెడ్డి పోస్ట్ లు ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఆయన పై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. అంతే గుడివాడ పోలీసులు రంగంలోకి దిగారు. రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు ఉంటే వెనక్కు తగ్గుతారా..అసలు లేనే లేదు. అందుకే శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇటీవలనే నెల్లూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మల్లూ నవీన్‌కుమార్‌ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నవీన్‌ ఫేస్‌బుక్‌లో వైఎస్సార్‌ కుటుంబం పేరుతో పేజీ నిర్వహిస్తూ టీడీపీ వ్యతిరేక వార్తలు రాస్తున్నాడు. ఫలితంగా నెల్లూరుకు వెళ్లి వేకువజామునే నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోయినేడు ఇంటూరు రవికిరణ్‌ అనే వ్యక్తిని గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకోనున్నారు. ఫలితంగా వ్యతిరేక వార్తలు తగ్గే వీలుంది. అదే సమయంలో జగన్ పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాటి గురించి పోలీసులు పట్టించుకోక పోవడం మరింత విచిత్రం. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకునే పోలీసులు..అదే వైరి వర్గం పార్టీల పై రాతలు రాసే వారిని వదిలి పెట్టడం ఆశ్చ్రర్యమే. 

Related Posts