YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పిఠాపురం..గరం.. గరం

పిఠాపురం..గరం.. గరం

కాకినాడ, మార్చి 19
కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పిఠాపురం నుంచి పవన్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన కాసేపటికే.. పిఠాపురం ఇంఛార్జి వంగా గీత క్యాంప్ ఆఫీసుకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్ ప్రకటనతో.. అప్రమత్తమైన వైసీపీ అందరినీ ఏకం చేసే పనిలో పడింది.పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా? లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా? అనే దానిపై చర్చించింది. వీరిద్దరూ కాకపోయినా వంగా గీతను పవన్ కల్యాణ్ పై పోటీకి నిలపాలని చూస్తోంది. అయితే, గతంలోనూ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ముద్రగడ ప్రకటించారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ ముగ్గురిలో ఎవరు పోటీలో ఉండాలో నిర్ణయించనుంది వైసీపీఇక, మరోవైపు పిఠాపురంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ ఎన్ వర్మ.. ఇవాళ కార్యకర్తలు అనుచరులతో సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వర్మ సైతం వైసీపీకి టచ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీలోకి వెళ్లకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. గతంలో పిఠాపురం నుంచి వంగా గీత విజయం సాధించారు.ఒకవేళ ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడు పోటీ చేసినా సపోర్ట్ ఇవ్వాలని వంగా గీత ప్లాన్ చేస్తున్నారు. అటు పవన్ పై ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనే చర్చ కూడా వచ్చింది. 2009లో ఇదే పిఠాపురం నుంచి వర్మ, వంగా గీత, ముద్రగడ పోటీ చేశారు. ఇప్పుడు వర్మతో టచ్ లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ వర్మ వైపీపీలోకి వెళితే ఈ ముగ్గురు పవన్ ను కట్టడి చేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం టీడీపీ-జనసేన పార్టీల్లో ఠారెత్తించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తనకు సీటుకు దక్కలేదని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ తీవ్ర మనస్తాపానికి గురవ్వడం.. అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయి వీరంగం సృష్టించడం.. ఆఖరికి చంద్రబాబు, పవన్, లోకేష్‌పై పచ్చిబూతుల వర్షం కురిపించిన పరిస్థితి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సేనాని-వర్మ కలిసిపోయారు.. అంతా కూల్ అయిపోయింది. ఆందోళనలు మొదలుకుని ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానంత వరకూ వచ్చిన వ్యవహారానికి ఫుల్‌స్టాప్ ఎక్కడ పడింది..? వర్మ ఎక్కడ కమిట్ అయ్యారు..? ఆయనకొచ్చిన హామీ ఏంటనే విషయాలు ఇప్పుడు చూద్దాం..ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రానివ్వకూడదన్నదే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి టార్గెట్. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటోంది కూటమి. ఈ పరిస్థితుల్లోనే గోదావరి జిల్లాలను తొలుత ఎంచుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో జిల్లాను క్లీన్ స్వీప్ చేయడానికి వ్యూహ రచన చేసింది. ఇందులో భాగంగానే పవన్‌ పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. సేనాని ఇక్కడ్నుంచి పోటీచేస్తే.. కాకినాడ పార్లమెంట్‌‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గెలవచ్చన్నది టార్గెట్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా కాపు సామాజిక వర్గం కూడా 75 శాతం ఉండటంతో కచ్చితంగా గెలవచ్చన్నది ప్లాన్. అయితే.. తనకు కంచుకోటగా మలుచుకున్న వర్మ మాత్రం అందుకు మొదట అంగీకరించలేదు.. కానీ చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పిలిపించి సర్దిచెప్పడంతో కూల్ అయ్యారు వర్మ. పనిలో పనిగా ఆయనకు కీలక హామీలు ఇవ్వడంతో పాటు.. సముచిత స్థానం ఇస్తానని మాటిచ్చారు కూడా.

Related Posts