విశాఖపట్టణం, మార్చి 19
విశాఖకు చెందిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు వైసీపీ బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దుర్తి నియోజకవర్గ టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించారు. ఈ కారణంగా ఆయన తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నేను పార్టీ వీడుతున్నానని వస్తున్న వార్తలను మీడియాలో చూస్తున్నాను. ఈ వార్తలపై నా సమాధానం ‘నో’ కామెంట్స్ అంతే అని బండారు సత్యనారాయణ మూర్తి చెబుతున్నారు. కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులతో చర్చలు జరుపుతున్నాను. వారి అభిప్రాయాలను తీసుకుంటాను. ఆపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రెండు, మూడు రోజుల్లో మీడియా మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతానని ప్రకటించారు. వైసీపీ నుంచి బండారుకు పిలుపు వచ్చిందని.. ముఖ్యనేతలు కొందరు టచ్‌లోకి వెళ్లగా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని.. ఈయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా సైకిల్ దిగుతారని టాక్ నడుస్తోంది. బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశాఖలో ప్రచారం జరుగుతోంది. అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థిని ప్రకటించినా అనకాపల్లికి మాత్రం ప్రకటించలేదు. బీసీ అభ్యర్థికి ఇస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు ఈసారి టికెట్ దక్కలేదు. పెందుర్తి టికెట్ ఆశించిన బండారుకు టీడీపీ విడుదల చేసిన లిస్టులో ఆశాభంగం కలిగింది. పెందుర్తి సీటు జనసేనకు దక్కింది. దీంతో మనస్థాపంలో ఉన్న బండారుకు వైసీపీ గాలం వేస్తోంది. తమ పార్టీలోకి తీసుకునేందుకు నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీ బరిలో దించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బండారుతో వైసీపీ నాయకులు టచ్ ఉన్నారనే ప్రచారం సైతం కొనసాగుతోంది.ఈ పరిణామాలతో బండారు సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి టికెట్ దక్కని వాళ్లతో బండారు సత్యనారాయణ మంతనాలు చేస్తున్నారు. వారందరినీ కూడా వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం బండారును వైసీపీలోకి వెళ్లొద్దని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని.. అధినేత చంద్రబాబు తప్పకుండా న్యాయం చేస్తారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.