YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాసులు కురిపిస్తున్న కొత్త సిరీస్

కాసులు కురిపిస్తున్న కొత్త సిరీస్

హైదరాబాద్, మార్చి 19
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీ ప్రక్రియ కొనసాగుతూనే విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో ఫ్యాన్సీ టీజీ నంబర్ ప్లేట్ల వేలం ప్రారంభం కావడంతో ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.30 లక్షలు వసూలు చేసింది. ఇటీవల ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజీ సిరీస్ నంబర్ ప్లేట్లను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో నిర్ణయించింది. ఈ నిర్ణయంతో తెలంగాణ పాత వాహనాల నంబర్ ప్లేట్లకు అప్డేట్ చేయడం కోసం పలువురు ఆసక్తిగా ఉన్నారు.కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహన యజమానులకు టీజీ నంబర్ ప్లేట్ లభిస్తుంది. అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన వాహనాలు మార్చాల్సిన అవసరం లేదు. తొలి టీజీ నంబర్ ప్లేట్ టీజీ 09 0001ను వేలంలో రూ.9.61 లక్షలకు కొనుగోలు చేశారు. టీజీ 09 0909, టీజీ 09 0005, టీజీ 09 0002, టీజీ 09 0369, టీజీ 09 0007 నంబర్ ప్లేట్లను వరుసగా రూ.2.30 లక్షలు, రూ.2.21 లక్షలు, రూ.1.2 లక్షలు, రూ.1.20 లక్షలు, రూ.1,07 లక్షలకు కొనుగోలు చేశారు. దీని ద్వారా మొత్తం రూ.30,49,589 ఆదాయం సమకూరింది.2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ను రాష్ట్రంగా ఎంచుకుంది. ఈ అంశంపై మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పాటించలేదని, ఇష్టానుసారంగా టీఎస్ తో వెళ్లాలని నిర్ణయించిందన్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ‘టీఎస్’ను టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నమన్నారు. పాత వాహనాలకు కాకుండా తెలంగాణ కొత్త వాహనాలన్నింటికీ ఇది వర్తిస్తుంది.
సీఎం నెంబర్ ప్లేట్లు మార్పు
ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్ల వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు చేపట్టిందని సీఎం రేవంత్ తోపాటు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు మొదలు సామాన్య ప్రజలు టీజీ పేరును ఉపయోగించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఎస్ స్థానంలో టీజీని మార్చింది. ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వాహనాల నంబర్ ప్లేట్లలో టీఎస్స్థానంలో టీజీని మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్చి 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వెహికల్యాక్ట్-1988లోని సెక్షన్ 41 (6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. గత ప్రకటనలోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణకు ఇదివరకున్న టీఎస్స్థానంలో టీజీ మార్క్ కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నడుపుతున్న వాహనాల నంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి టీఎస్ పేరిట రిజిస్ట్రేషన్‌ అవుతూ వస్తుండగా.. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో టీజీ పేరుతో రిజిస్ట్రేషన్‌ కానున్నాయి. అయితే, పాత వాహనాలకు టీఎస్పేరు మీదే కొనసాగుతాయని.. మోటారు వాహన యూనియన్ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related Posts