YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జిల్లాలు జిల్లాలు....ఖాళీ అయిపోతున్నాయ్...

జిల్లాలు జిల్లాలు....ఖాళీ అయిపోతున్నాయ్...

నల్గోండ, మార్చి 19,
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్‌ కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కారు దిగేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఓ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కమల తీర్థం పుచ్చుకోగా, మరో మాజీ ఎమ్మెల్సీ కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారట.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత బీఆర్ఎస్‌లో నేతలు ఉండలేకపోతున్నారు. ముఖ్య నేతలంతా కారు దిగుతుండడంతో గులాబీ అగ్ర నేతలకు కలవరపాటుకు గురవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కాషాయ దళంలో చేరగా, మరో మాజీ ఎమ్మెల్సీ కూడా కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట.ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి నల్లగొండ ఎంపీ టికెట్ ను ఆశించారు. అయితే నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. భువనగిరి అభ్యర్థి కోసం గులాబీ దళపతి కసరత్తు చేస్తున్నారుచిన్నపరెడ్డి గతంలో ఎమ్మెల్సీగా, ఎంపీగా పోటీచేసి ఓడి పోయారు. తరువాత రెండోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మరణాంతరం నాగార్జున సాగర్‌ అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. గులాబీ దళపతి మాత్రం నోముల తనయుడు భగత్‌కే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత చిన్నపరెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయింది. మళ్లీ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని భావించినా దక్కలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నించినా అధిష్టానం పట్టించుకోలేదు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ చిన్నపరెడ్డిని ఎంపీగా బరిలోకి దింపాలని ఒక దశలో అధిష్టానం ఆలోచన చేసింది. కానీ ఏమైందో తెలియదు.. కానీ, తేరా పార్టీని వీడియోలను భావిస్తున్నారట.
బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి నల్లగొండ ఎంపీ టికెట్‌ను ఆశించారు. అవసరమైతే నల్లగొండ, భువనగిరిలో నుంచి పోటీకి సిద్ధమని కూడా అమిత్ చెప్పారు. పార్టీలో కొందరు నేతలు అమిత్ ను వ్యతిరేకించడంతో బీఆర్ఎస్ నుంచి తాను పోటీ చేసేది లేదని గులాబీ పెద్దలకు ఖరాకండిగా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భువనగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ ఇప్పించాలని కోరారట. పార్టీలో చేరాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చిన మాట వాస్తవమేనని సుఖేందర్ రెడ్డి కూడా చెప్పారు.నేత భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఇక ఇప్పటికే హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వెంటనే నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ సైదిరెడ్డిని ప్రకటించింది. బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో మరికొందరు నేతలు కూడా కారు దిగేందుకు సిద్ధమవుతున్నారట. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ ను వీడి కమలం వైపు వెళ్లేందుకు రెడీ అవుతున్నారట.ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. తాజా రాజకీయ పరిణామాలు, ఎంపీ టిక్కెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి కారు దిగాలని నిర్ణయించుకున్నారట. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారట. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో చిన్నప రెడ్డి మంతనాలు జరిపుతున్నారట. అయితే నల్లగొండ ఎంపీ బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డిని పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. నల్లగొండ ఎంపీ టికెట్ లేనప్పటికీ భవిష్యత్తు రాజకీయాల కోసం కాషాయ దళంలో చేరాలని తేరా చిన్నపరెడ్డి భావిస్తున్నారట.

Related Posts