YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు 2019 ఎన్నికల వ్యూహం ఒకే దెబ్బకు జగన్ జనసేన, బీజేపీ టార్గెట్...

బాబు 2019 ఎన్నికల వ్యూహం ఒకే దెబ్బకు జగన్ జనసేన, బీజేపీ టార్గెట్...
2019 ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు యాక్ష‌న్ ప్లాన్ ఏమిటి ? ఒక‌వైపు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, ఇక మూడోవైపు బీజేపీ.. ఇలా ముప్పేట దాడి ప్రారంభించేసిన స‌మ‌యంలో వీటన్నింటినీ త‌ట్టుకుని.. ఎలా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటారు? ఇందుకు ఆయ‌న ద‌గ్గ‌రున్న వ్యూహ‌మేమిటి? అనే సందేహాలు ప్ర‌జ‌ల్లో, నేత‌ల్లోనూ ఉన్నాయి. అయితే మ‌హానాడు వేదిక‌గా.. దీనికి స‌మాధానం ఇచ్చారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మహానాడు వేదికగా మోడీ, అమిత్ షాను టార్గెట్ చేయటం ద్వారా ఇప్ప‌టికే ప్రజల్లో ఉన్న బీజేపీ వ్యతిరేకతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. జగన్, పవన్ బీజేపీ మనుషులే అని చెప్పటం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ లబ్ది పొందేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రధాన ఏజెండా చేసిన పనులు చెప్పుకోవటం కంటే `బీజేపీ మోసం చేసింది. నేను అమాయకుడిని. మోసపోయాను. మొదటి నుంచి నేను ప్రత్యేక హోదానే అడిగాను. మోదీ ఇవ్వలేదు` అని ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోడీ వీడియోలు వేసి పదే పదే చంద్రబాబు బీజేపీపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆయ‌నే.. ఇటు అసెంబ్లీలోనూ, వెలుప‌ల ప్ర‌త్యేక హోదాపై చేసిన వ్యాఖ్య‌లు ఏమాత్రం బ‌య‌టికి రాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ఎన్నిక‌ల్లో చేసిన ప్ర‌చారాస్త్రాన్నే ఆయ‌న ఈసారి కూడా బ‌య‌ట‌కు తీయ‌బోతున్నారు. త‌నమీద, త‌న వైఫ‌ల్యాల‌పై ప్ర‌జ‌ల ఫోక‌స్ పెట్ట‌కుండా.. ముందునుంచే యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేశారు. ఒకే దెబ్బ‌తో బీజేపీస‌హా జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌కు చెక్ చెప్పేందుకు రెడీ అయ్యారు.రాజ‌కీయ అవ‌స‌రాలు మిత్రుల‌ను శ‌త్రువులు చేసేస్తాయి.. శ‌త్రువుల‌ను మిత్రులు చేసేస్తాయి. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఏపీలో ప‌రిస్థితులు. 2014లో టీడీపీకి బీజేపీ, జ‌న‌సేన మిత్రులుగా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఇప్పుడు రాజ‌కీయ విరోధులుగా మారిపోయాయి. చంద్ర‌బాబు ఒక్క‌రే ఇప్పుడు 2019 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు అంత సులువు కాద‌ని తేలిపోయింది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ మూడు పార్టీలపై ఎలాంటి వ్యూహం అమ‌లు చేస్తార‌నే సందేహం అంద‌రిలోనూ ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఒక ప్ర‌త్యేక స్ట్రాట‌జీతో రెడీ అయ్యార‌ట‌. సొంత బలం కంటే ఎప్పటికప్పుడు ఆయనకు ఓ `వీక్ పాయింట్` కావాలి. దీనినే టార్గెట్ చేసి తన అర్థ, అంగ బలాలు ప్రయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదేదిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.ఇక రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏపీలో పీక్ స్టేజ్ లో ఉంది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు కూడా సమన్యాయం చేయలేదనే నెపంతో కాంగ్రెస్ పై వ్యతిరేకతను క్యాష్ చేసుకున్నారు. దీనికి తోడు చంద్రబాబు అనుభ‌వం కూడా క‌లిసొచ్చింది. గత ఎన్నికల్లో చంద్రబాబు టార్గెట్ కాంగ్రెస్.. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ. రాజధాని నిర్మాణంలో తన వైఫల్యాలను కూడా బీజేపీ ఖాతాలో వేసి ముందుకు సాగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా?. చంద్రబాబు కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా? చంద్రబాబు ప్లాన్ ఈ సారి ఏ మేరకు ఫలిస్తాయి? మ‌రి వేచిచూడాల్సిందే!

Related Posts