YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీ టార్గెట్ ఒడిస్సా

బీజేపీ టార్గెట్ ఒడిస్సా
దాదాపు ఇరవై ఏళ్ల ఆయన కోటను బద్దలు చేయడం సాధ్యమా? అనితర సాధ్యుడు, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి, సున్నిత మనస్కుడు అయిన నవీన్ పట్నాయక్ కు ఈసారి దెబ్బ పడుతుందా? ఒడిషాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అవుననే అంటున్నాయి తాజా సర్వేలు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఒడిషా రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందని తేల్చి చెప్పాయి. దీంతో నవీన్ పట్నాయక్ ఒకింత ఆందోళనలో ఉన్నారు. మామూలుగా నవీన్ పట్నాయక్ ను ఓడించడం అంత తేలిక కాదు. ఆ విషయం కమలనాధులకూ తెలియంది కాదు.గత కొన్నాళ్లుగా ఒడిషాపై అమిత్ షా దృష్టి పెట్టారు. అక్కడ క్యాడర్ ను బలోపేతం చేశారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ కంటే బీజేపీ బలంగా ఉందని తేలింది. ఒడిషాలో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ నామమాత్రంగా మారింది. ఒడిషాలో కాషాయజెండాను ఎగురవేస్తామని అమిత్ షా పదే పదే చెబుతున్నారు. అది సాధ్యమవుతుందో లేదో తెలియదు కాని పార్టీకి మాత్రం కొంత పాజిటివ్ వేవ్ ఉన్నట్లు సర్వేలు తేల్చడంతో కమలనాధులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.నవీన్ పట్నాయక్ దాదాపు 18 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆయనపై చిన్న మచ్చ కూడా లేకుండా రాజ్యాన్ని ఏలుతున్నారు. కేవలం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టే నవీన్ పెద్దగా కేంద్ర రాజకీయాల జోలికి వెళ్లరు. 2019 ఎన్నికలకు నవీన్ సమాయత్త మవుతున్నారు. తన మంత్రివర్గంలో చిన్న తప్పు జరిగినా వెంటనే తొలగించే గట్స్ ఉన్న నేతగా నవీన్ గుర్తింపు పొందారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందని దాన్ని క్యాష్ చేసుకుని పవర్ లోకి రావాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ‘‘మో బూత్ సబ్ సే మజ్ బూత్’’ పేరిట ఇప్పటికే సైన్యాన్ని కమలం పార్టీ సిద్ధం చేసింది.మరోవైపు మోడీ రెండు రోజుల క్రితం ఒడిషాను పర్యటించారు. ఆయన కటక్ లో జరిగిన బహిరంగ సభలో నవీన్ పై నిప్పులు చెరిగారు. 18 ఏళ్ల నవీన్ పాలనను మోడీ ఎండగట్టారు. మహానదిలో నీరు యాభై శాతం సముద్రం పాలవుతున్నా పాలకులు  కొన్నేళ్లుగా పట్టించుకోక పోవడంపై విరుచుకుపడ్డారు. లోయర్ ఇంద్ర ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని విమర్శించారు. మోడీ పర్యటన తర్వాత బీజేపీ లో మరింత జోష్ పెరిగిందని చెబుతున్నారు. మిషన్ 120 పేరిట ఇప్పటికే అమిత్ షా వ్యూహరచన చేశారు. ఓడిషాలోని తూర్పు ప్రాంతంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని సర్వే సంస్థలు కూడా తేల్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒడిషాలో అధికారంలోకి వస్తుందని కూడా కొన్ని మీడియా సంస్థలు తమ సర్వేల ద్వారా వెల్లడించాయి. దీంతో కమలనాధుల్లో హుషారు పెరిగింది. మరి పట్నాయక్ తో పెట్టుకుని నెగ్గుకు రాగలరా? అన్నది చూడాలి.

Related Posts