YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పూర్వశ్రమానికి పనబాక

పూర్వశ్రమానికి పనబాక

నెల్లూరు, మార్చి 21
పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.ఎన్నికలు సమీపిస్తున్నాయి. టిక్కెట్లు దక్కని వారు పక్క పార్టీల్లో చేరుతున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరికలు జరిగాయి. తాజాగా తెలుగుదేశం పార్టీని సైతం కొంతమంది వీడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టిడిపికి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టిడిపి నుంచి బయటకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీ సీటును ఆశిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. అటు సర్వేల్లో వెనుక పడడంతో ఈసారి చంద్రబాబు ఆమెకు టికెట్ ఇవ్వరని తెలుస్తోంది. అదే జరిగితే పనబాక లక్ష్మి పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని సమాచారం.పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. పెట్రోలియం, సహజ వాయువు శాఖ, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2004 నుంచి 2009 మధ్య కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. తిరుపతి ఎంపీ అకాల మృతితో మరోసారి చంద్రబాబు పనబాక లక్ష్మికి అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో సైతం పనబాక లక్ష్మికి ఓటమి తప్పలేదు. కానీ ఈ ఎన్నికల్లో సైతం ఎంపీ సీటును ఆమె ఆశించారు. తిరుపతి కానీ బాపట్ల పార్లమెంట్ స్థానం కానీ కేటాయించాలని కోరారు. అయితే ఆమె సర్వేల్లో వెనుకబడ్డారు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపిలో ఉండకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ చంద్రబాబు టిక్కెట్ ను నిరాకరిస్తే.. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Related Posts