YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్యాస్ సబ్సిడి పడిందా...

గ్యాస్ సబ్సిడి పడిందా...

వరంగల్, మార్చి 21
గతంలో కట్టెల పొయ్యి మీద లేదా కిరోసిన్ స్టవ్ ల మీద వంట చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఇంటికి గ్యాస్ సిలండర్లు ఉన్నాయి. దీని వల్ల మిగిలిన రెండు మాయం అయ్యాయనే చెప్పాలి. అయితే గ్యాస్ సిలండర్ల వినియోగం ఎక్కువ అవడం వల్ల సిలిండర్ రేటు పెరిగిన కూడా వాటినే కొనుగోలు చేస్తున్నారు కానీ.. ఇతర ఆప్షన్ లను ఎంచుకోవడం లేదు. ఇన్ని రోజుల సెంట్రల్ గవర్నమెంట్ సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది. మరి మీకు ఈ సబ్సిడీ పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా?ఎల్పీజీ సబ్సిడీకి అర్హత పొందాలంటే.. ఎల్ పీజీ సర్వీస్ ప్రొవైడర్ కు ఆధార్ కార్డు నంబర్ లిక్ చేసి ఉండాలి. ఖాతా నంబర్ ఆధార్ కార్డ్ కు కనెక్ట్ చేసి ఉంచాలి. ఇవి చేస్తేనే సబ్సిడీ వర్తిస్తుంది. అయితే తెల్లరేషన్ కార్డు ఉండి ఎల్పీజీ గ్యాస్ వాడుతున్న వినియోగదారులకు మాత్రమే రూ. 500 కు గ్యాస్ వస్తుందని తెలిపింది ప్రభుత్వం. అయితే నేరుగా సిలండర్ ను రూ. 500కే ఇవ్వకుండా డెలివరీ సమయంలో మొత్తం నగదును తీసుకొని అర్హులైన వారికి 500 కంటే ఎక్కువ చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో అకౌంట్ లో జమ చేస్తున్నారు. సబ్సిడీకి సంబంధించిన మెసేజ్ లు కొందరి ఫోన్ లకు వస్తుంటే.. మరికొందరికి మాత్రం రావడం లేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా మీకు మనీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. మీరు సబ్సిడీ పొందుతున్నారా? లేదా? ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా? అనే వివరాలు తెలుసుకోవాలి అంటే.. www.mylpg.in కు లాగిన్ అవ్వాలి. లాగిన్ అనే ఆప్షన్ దగ్గర ఐడీ, పాస్ వర్డ్ ఇవ్వాలి. అక్కడ గ్యాస్ చిత్రాలు కనిపిస్తాయి అందులో కంపెనీ పేరును ఎంచుకోవాలి.తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ పై క్లిక్ చేసి.. సిలండర్ కు సబ్సిడీ వచ్చిందా లేదా కనుక్కోవాలి. లేదా https://cx.indianoil.in/EPICIOCL/faces/GrievanceMainPage.jspx లింక్ కు వెళ్లి కూడా సబ్సిడీ చెక్ చేసుకోవచ్చు. ఎల్ పీజీని క్లిక్ చేసి.. సబ్సిడీ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా గ్యాస్ కనెక్షన్ ఐడీ వివరాలను ఎంట్రీ చేయాలి. అప్పుడు మీకు వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు చివరి ఐదు సిలండర్ల బుకింగ్ సమాచారం కూడా మీరు తెలుసుకోవచ్చు.

Related Posts