YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రాలయంలో టిక్కెట్ ఫైట్

మంత్రాలయంలో టిక్కెట్ ఫైట్

కర్నూలు, మార్చి 22
ఆధ్యాత్మికానికి కేంద్రమైన రాఘవేంద్ర స్వామి సన్నిధిలో రాజకీయం రంజుగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత రెండు సార్లు పోటీ చేసిన తిక్కారెడ్డికి కాకుండా ఈ సారి రాఘవేంద్రరెడ్డికి టిక్కెట్ కేటాయించారు. పేరులో రెడ్డి ఉన్నప్పటికీ రాఘవేంద్రరెడ్డి  బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. తిక్కారెడ్డి తనకు అవకాశం కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. టిక్కెట్ ఇవ్వకపోయినా పోటీ చేస్తానంటున్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా  తిక్కారెడ్డి ఉండేవారు.  తిక్కా రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం 2014, 2019 ఎన్నికల్లో అవకాశం కల్పించినప్పటికీ రెండుసార్లు  ఓటమి చవిచూశారు. మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ మంత్రాలయం కూటమి అభ్యర్థిగా తిక్కారెడ్డికే అవకాశం కల్పిస్తుందని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తిక్కారెడ్డి అనుచరులు భావించారు. మొదటి నుంచి టిడిపి అధిష్టానం మాత్రం ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎమ్మిగనూరు నుంచి  జయనాగేశ్వరరెడ్డికే అవకాశం కల్పించడంతో  మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డికి అవకాశం ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ జాబితాలో తిక్కా రెడ్డి బదులు మంత్రాలయం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్ర రెడ్డి పేరు ప్రకటించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కసారిగా తిక్కారెడ్డి అనుచర వర్గం ఆందోళనకు దిగారు. మరొకక్క రాఘవేంద్ర రెడ్డి టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి  పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే తిక్కా రెడ్డి వర్గం రాఘవేంద్ర రెడ్డి కి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.  ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి అధినేతలు నియోజకవర్గాల్లో ఏర్పడిన విభేదాలను ఎలా చెక్ పెడతారో  అని జిల్లా నేతలు నియోజకవర్గ ప్రజలు  పార్టీకి కష్టపడిన వారి పేర్లు ప్రకటించకుండా కొత్తగా పార్టీల్లో చేరిన వ్యక్తులకు సీటు కేటాయించడంపై తిక్కు రెడ్డి వర్గం సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని పార్టీ అధినాయకత్వంపై మండిపడుతున్నారు. 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడిన టికెట్ రాకపోవడంతో తన భవిష్యత్ కార్యచరణ కోసం ఇప్పటికే కార్యకర్తలతో ఆయా మండలాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. కార్య కర్తలు నుండి పార్టీ కన్నా నాయకుడే ముఖ్యమని అంటున్నప్పటికి టికెట్ రాకపోతే  మంత్రాలయం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ తిక్కారెడ్డిని బుజ్జగించి రాఘవేంద్రరెడ్డి విజయానికి పని చేసేలా చేయకపోతే సమస్యలు వస్తాయని ఆ పార్టీలు నేతలు ఆందోళన చెందుతున్నారు.

Related Posts