YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీ ఎన్నికలకు వడివడి అడుగులు సర్పంచ్ కు గులాబీ, వార్డు సభ్యుడికి తెలుపు

పంచాయితీ ఎన్నికలకు వడివడి అడుగులు సర్పంచ్ కు గులాబీ, వార్డు సభ్యుడికి తెలుపు
గ్రామపంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. సర్పంచి, వార్డు సభ్యులకు సంబంధించిన గుర్తులు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. బ్యాలెట్‌ పేపర్ల కోసం ప్రతిపాదనలు పంపించారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లాలో రూ.10 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.జులైలో ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచి, వార్డు సభ్యులకు వేరు వేరుగా బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయి. సర్పంచికి గులాబీ రంగు కేటాయిస్తారు. వీరికి గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాట్‌, కప్పు-సాసరు, విమానం, బంతి, షటిల్‌, కుర్చీ, వంకాయ, నల్లబోర్డు, కొబ్బరికాయ, మహిళాపర్సు, మామిడికాయ, సీసా, బకెట్‌, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీ లైటు, బ్రష్‌, గొడ్డలి, గాలిబుడగ, బిస్కెట్‌, వేణువు, ఫోర్కు, చెంచా వంటి గుర్తులు ఉన్నాయి. అభ్యర్థుల పేర్ల అక్షరాల క్రమంలో గుర్తులు ఇస్తారు.గ్రామపంచాయతీ వార్డు సభ్యుడి బ్యాలెట్‌ పేపర్‌ తెలుపు రంగులో ఉండనుంది. వీరికి జగ్గు, గౌను, గ్యాస్‌ పొయ్యి, స్టూలు, గ్యాస్‌ సిలెండర్‌, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్‌ యాంటీనా, గరాట, మూకుడు, కేతిలితో పాటు మరికొన్ని గుర్తులు కేటాయించారు. అభ్యర్థుల పేర్ల అక్షరాల క్రమంలోనే వీటిని ఇవ్వనున్నారుగతంలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలో నోటాను పొందుపర్చారు. పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చక పోతే నోటా బటన్‌ నొక్కే అవకాశం కల్పించారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం దీనిని పొందుపర్చుతున్నారు. బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులకు చివరన నోటా అని ముద్రించి ఉంటుంది. అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే దీనిపై ఓటు వేయవచ్చు.
పొలింగ్‌ బూత్‌ల జాబితా తయారు చేసి  2 నుంచి ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. బీసీ ఓటర్ల గణన జూన్‌ 1న పూర్తి కానుంది. జూన్‌ 10 లోపు రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ అతి కీలకం కానుంది. జిల్లా అధికారులు ఇందుకోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. ఎన్నికల సంఘం నుంచి పేపర్లు వచ్చిన తర్వాత బ్యాలెట్‌ పేపర్లు ముద్రించనున్నాయి. ఎన్నికల కోసం గతంలో రూ.3 కోట్లు కేటాయించడంతో ఆ నిధులు సరిపోలేవు. ఈసారి ఒక్కో జిల్లాకు రూ.5 కోట్లు అవసరం ఉంటుందని అధికార యంత్రాగం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇది వరకే పంపించింది. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్‌ పెట్టెల మరమ్మతు, విధులు నిర్వహించే ఉద్యోగులకు భత్యం, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, స్టేషనరీతో పాటు ఇతర ఖర్చులు ఉండనున్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేశామని చెబుతున్నా ఇంకా జిల్లాకు చేరలేదు.

Related Posts