YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు? క్లారిటీ ఎప్పుడు?

కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు? క్లారిటీ ఎప్పుడు?

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సాధారణ ఎన్నికలతో పాటు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు సర్వం సిద్దం అవుతున్న వేళ పార్టీల అభ్యర్థులు ఎవరూ అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. దీంతో ఎవరికి వారు అభ్యర్థులమంటు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంతకీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థులు ఎవరు వాచ్ ది స్టోరీ. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్‎లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ఈ పోరులో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. సెకండ్ ప్లేస్‎లో బిజెపి అభ్యర్థి గణేష్, థర్డ్ ప్లేస్‎కి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెల పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నుండి టికెట్లు ఆశిస్తున్న నేతలు.. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక కార్యకర్తలు కోరిక మేరకు సాయన్న కుటుంబం నుండి మరోసారి ఆయన కూతురు నివేదిత బరిలో నిలబడాలని సిద్దం అయింది. ఈ విషయంపై కేసీఆర్‎ను కలిసి టికెట్టు తనకే కేటాయించాలని కోరారు. కానీ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఆశావాకులు ప్రతిసారి సాయన్న కుటుంబానికే టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈసారి తమకు కేటాయించాలని పలువురు నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు టాక్ వినబడుతుంది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్‎కు ఈ ఉప ఎన్నిక అడ్వాంటేజ్‎గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముడు నెలలలోపే ఉప ఎన్నిక రావడంతో ఎలగైనా ఆ స్థానాన్ని గెలుచుకోవలని ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎవరు కంటోన్మెంట్ ఉపఎన్నిక బరిలో ఉండనున్నారు అన్న విషయంపై ఏ పార్టీలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొన్నటి ఎన్నికలు బరిలో నిలబడిన గద్దర్ కూతురు వెన్నెల మరోసారి పోటీలో ఉండే అవకాశం ఉందని వినిపిస్తుంది. అలా కాకుండా ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు ట్రై చేస్తున్న కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్‎ను బరిలో నిలిపి ఈజీగా సీటు గెలవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది హస్తం పార్టీ. మరోవైపు బిజెపి నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మొన్నటి ఎన్నికలబరిల్లో నిలిచిన బిజెపి అభ్యర్థి గణేష్‎కు మరోసారి పార్టీ అధిష్టానం అవకాశం
ఇచ్చే యోజనలో ఉన్నట్టు తెలుస్తుంది. మొన్నటి హోరాహోరీ పోరులో రెండవ స్థానంలో నిలిచిన గణేష్ ఈసారి కూడా తనకి అవకాశం వస్తుందని ఈ ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలుపొంది అసెంబ్లీలో బిజెపి స్థానాలను పెంచుతాము అని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నామినేషన్లు వేయడానికి సమయం ఉండడం, ఇంకా ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపైనే కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరు కంటోన్మెంట్ బరిలో నిలబడతారనే అంశంపై క్లారిటీ రావడం లేదు. దీనికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 

Related Posts