YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో విచిత్ర వాతావరణం

తెలంగాణలో విచిత్ర వాతావరణం
రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అప్పటివరకు భానుడి ప్రతాపంతో విలవిల్లాడిన ప్రజలు కొద్ది సేపట్లోనే వాతావరణం అనూహ్యంగా మారి చీకట్లు కమ్ముకొచ్చి భారీ వర్షాలు కురుస్తుండటంపై జనాలు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా సూర్యుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు.  నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, మణుగూరు అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మిగతా జిల్లాల్లోనూ 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఎండలో బయటకు వెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, సింగరేణి ప్రాంతంలో 48 నుంచి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, ఎండ, ఉక్కపోతతో గనుల్లో పనిచేయలేకపోతున్నామని కార్మికులు చెబుతున్నారు. వరుసగా మూడు రోజుల నుంచి ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని మొదలెడుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఉష్ణతాపం తగ్గట్లేదు. సింగరేణిలో కార్మికులు విధులకు వెళ్లాలంటే జంకుతున్నారు. నిత్యావసరాలకు కోసం మణుగూరు పట్టణానికి వచ్చే గ్రామీణ ప్రజలు ఎండతీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతున్నది. మణుగూరు ఓసీలలో బొగ్గు బెంచ్‌లు ఎండవేడికి కాలుతున్నాయి. బొగ్గు నిల్వలు మండి బూడిదవుతున్నాయి. ఇప్పటి వరకు ఎండ తీవ్రత వల్ల సుమారు ఐదు వేల టన్నుల బొగ్గు కాలి బూడిదైందని, సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కార్మికులు చెబుతున్నారు. మంటలను ఆర్పేందుకు యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవట్లేదు. మణుగూరు ఓసీలలో ఎండవేడికి కాలిపోతున్న బొగ్గు నాణ్యత కల్గినది కాదని సింగరేణి అధికారులు అంటున్నారు. గతేడాది సింగరేణి అధికారులు కార్మికులకు మజ్జిగ, మంచినీళ్లు సరఫరా చేశారు. ఈ యేడాది మాత్రం ఇప్పటి వరకూ ఏ చర్యలూ చేపట్టలేదు. పట్టణంలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంచాలని, చలివేంద్రాల ద్వారా తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, సింగరేణి కార్మికులకు పని వేళలు మార్చాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Related Posts