YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మండలాల వారీగా ఇఫ్తార్ విందులు

మండలాల వారీగా ఇఫ్తార్ విందులు
జిల్లాకు రంజాన్ కానుకలు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు దుస్తులను పంపిణీ చేస్తోంది.రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందిస్తున్నారు. ప్రతీ రంజాన్ పండుగకు గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తూ వస్తున్నారు.. రాష్ట్ర ప్రభు త్వం తరపున ఇఫ్తార్ విందుకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా విడుదల చేసింది. మండలాల వారీగా నిధులు కేటాయించింది. జిల్లా యంత్రాంగం ప్రతీ మండలంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. గత సంవత్సరం నియోజకవర్గ పరిధిని పరిగణలోకి తీసుకొని ఇఫ్తార్ విందును ఇచ్చారు. గత ప్రభుత్వాలు ముస్లింల అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు ఏటా రంజాన్ కానుకగా ముస్లింలకు బట్టలను పంపిణీ చేస్తోంది. . ముస్లిం మత పెద్దలు ఇచ్చిన జాబితా ప్రకారం అధికారులు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. అదే విధంగా మండలాల వారీగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. బట్టలు పంపిణీ చేసిన రోజునే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు. వచ్చిన దుస్తులను త్వరలోనే లబ్ధిదారులకు మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 16మండలాలకు 3,240 గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయి. మండలాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు తహసీల్దార్ల పర్యవేక్షణలో పంపిణీ సాగుతుంది. ఒక గిఫ్ట్ ప్యాకెట్‌లో లాల్చి, పైజామా, ఒక చీర, జాకెట్ పీస్, ఒక పంజాబీ డ్రెస్.. మొత్తం ఒక ప్యాకెట్‌లో ముగ్గురికి సంబంధించిన దుస్తులు ఉంటాయి. ఈ నెల 17నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మండలాల వారీగా లబ్ధిదారులకు గిఫ్ట్ ప్యాకెట్లను ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో నిల్వ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16మండలాల పరిధిలో అర్హులైన ముస్లింలను గుర్తించి వారికి గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేయనున్నారు. అదే రోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా దుస్తులను పంపిణీ చేసి, ఇఫ్తార్ విందులు ఇవ్వడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  16మండలాలలకు మండలాల వారీగా గిఫ్ట్ ప్యాకెట్లు వచ్చాయి. వీటిని సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణం- 606, మహబూబాబాద్ రూరల్-267, కేసముద్రం-295, నెల్లికుదురు-150, గూడురు-182, డోర్నకల్-330, కురవి-207, దంతాలపల్లి-82, మరిపెడ-257, చిన్న గూడురు-62, నర్సింహులపేట-62, తొర్రూర్-250, పెద్దవంగర-150, కొత్తగూడ-100, గంగారం-80, బయ్యారం-80, గార్ల-80 మొత్తం 3,240 గిఫ్ట్ ప్యాక్‌లను అందించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను మత పెద్దలు, అధికారులు కలిసి సిద్ధం చేస్తున్నారు. జిల్లాకు వచ్చిన దుస్తులను త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. 

Related Posts