రైతులు ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సారి పెట్టుబడి టెన్షన్ లేకపోవడంతో కర్షకలోకం ఉత్సాహంగా ఏరువాకకు సిద్ధమవుతోంది. అటు ప్రభుత్వం సైతం రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలను, ఎరువులను దుకాణాల్లో అందుబాటులో ఉంచింది. ప్రతీ యేట ఏరువాక సాగే సమయంలో పెట్టుబడుల ఆందోళనతో ఉండే రైతులు ఈసారి అంతులేని ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. కావాల్సిన విత్తనాలు దుకాణాల్లో అందుబాటులో ఉండడంతో పాటు వాటిని కొనుక్కునేందుకు రైతుల వద్ద నగదు నిల్వలు కూడా ఉండడంతో పనులకు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొచ్చన రైతుబంధు పథకం ద్వారా జిల్లాలోని 78,288 మంది రైతులకు రూ.69 కోట్ల 41 లక్షల 44వేల 520 వానాకాలం పంట పెట్టుబడి కోసం నగదు రూపేణా అందించారు. దీంతో దున్నుళ్లకు, ఎరువులు, విత్తనాలు కొనుక్కునేందుకు రైతులకు ఇబ్బందులు లేకపోవడంతో ధీమాగా ముందుకు వెళ్తున్నారు.సాగులో కొత్త పద్ధ్దతుల వైపు రైతులు పయనించేలా చర్యలు తీసుకుంటోంది.జిల్లాలో ప్రధానంగా వానాకాలం సీజన్‌లో వరి, పత్తిని ఎక్కువగా సాగుచేస్తారు. ఇందుకు తగ్గట్టుగానే అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. పత్తికి సంబంధించి నాలుగైదు జిల్లాలకు వరంగల్ ప్రధాన కేంద్రంగా ఉండడంతో 6లక్షల56వేల529 పత్తి విత్తన ప్యాకెట్లను పలు విత్తన దుకాణాల్లో సిద్ధంగా ఉంచారు. జిల్లాలో 31,100 హెక్టార్లలో పత్తి సాధారణ సాగు కాగా గతేడాది 35,408 హెక్టార్లలో సాగు చే శారు. ఈ సారి మాత్రం 38,000 హెక్టార్లలో పత్తిని సాగు చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరి వి స్తీర్ణం కూడా గణనీయంగా పెరుగనున్నట్లు అంచనా. గత ఏ డాది కంటే ఎక్కువగా మొత్తం 17,800 హెక్టార్లలో వరి సాగు కావచ్చని తెలుస్తోంది. ఇవే కాకుండా 8 వేల ఎకరాల్లో మొక్కజొన్న కూడా సాగవుతుంది. మరో 1500 ఎకరాల్లో ఇతర పం టలు సాగవనున్నాయి. 11,060 క్వింటాళ్లు పలు రకాల సబ్సిడీ విత్తనాలు సైతం అందుబాటులో ఉన్నాయి. పత్తి విత్తనాల ధరలను కూడా తగ్గించేలా ప్రభుత్వం విత్తన కంపెనీలపై తెచ్చిన ఒ త్తిడితో రూ.800 నుంచి రూ.740లకు ధరలు తగ్గించారు.. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ దీవుల్ని తాకాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నే డో, రేపో మొదటగా కేరళకు ఆతర్వాత మన రాష్ట్రం వైపు రుతుపవనాలు రావడం ఇక లాంఛనమే. ఈ నేపథ్యంలో రైతులు అ ప్రమత్తమయ్యారు. కావాల్సిన ఎరువుల్లో 6883 మెట్రిక్ టన్నుల యూరియా, 4646 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1948 మెట్రిక్ టన్నుల పొటాష్, 20,568 మెట్రిక్ టన్నుల ఇతర కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఇప్పటికే 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ నిల్వలుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆర్గానిక్ పార్మింగ్‌పై కూడా పెద్ద మొత్తంలో వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. దీని కోసం రైతులకు అనేక ఏర్పాట్లను చేస్తున్నారు. 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించారు. వీరు తమ క్లస్టర్ల పరిధిలో వేలాదిగా మట్టి నమూనాలను సేకరించారు. వీటి రిపోర్టులు త్వరలోనే రైతులకు అందనున్నాయి. నకిలీ విత్తనాలపై ప్రత్యేకంగా పోలీసులు, వ్యవసాయాధికారులతో కలిపి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా వేసి నకిలీ విత్తన విక్రయదారులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకోనున్నారు.