విజయనగరం, మార్చి 23
విజయనగరం జిల్లా..ఈ పేరు చెబితేనే రాజులు, రాజ్యాలు గుర్తుకొస్తాయి. ఒకవైపు గజపతిరాజులు మరోవైపు బొబ్బిలి రాజుల ఏలుబడిలో లక్షలాది ఎకరాలు మాన్యం, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కళ్లముందు కదలాడతాయి. మరి రాజులే నేటి రాజకీయపార్టీ అభ్యర్థులుగా మరితే వారి ఆస్తులకు విలువ కట్టగలమా..? వారే గాక దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతల ఆస్తుల విలువ ఎంత ఉందో ఒకసారి చూద్దాంవిజయనగరం) జిల్లాలో గజపతిరాజుల ఆస్తులు లెక్కించాలంటే ఎకరాల్లో కాదు...జిల్లాల వారీగా లెక్కించాలి. ఎందుకంటే జిల్లాలో ఉన్న లక్షలాది ఎకరాలు ఒకప్పుడు వారి ఏలుబడిలోనే ఉండేది. కళాశాలలు, ఆస్పత్రులు, బడులు, గుడులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఒకటేమిటి జిల్లాలో ఉన్న ప్రతి ప్రజాసేవా కేంద్రాలకు వారు భూరివిరాళం ఇచ్చిన భూములే. అలాంటి గజపతిరాజుల వారసురాలుగా తెలుగుదేశం తరపున బరిలో దిగిన అధితి విజయలక్ష్మీ గజపతిరాజు ఆస్తుల విలువ ప్రస్తుతానికి 19 కోట్ల రూపాయలుగా ఉండగా... అప్పులు మాత్రం ఏమీలేవు. ఆమె పేరిట వివిధ బ్యాంకుల్లో పదికోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. ఒక కోటీ పది లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి.మొత్తంగా చరాస్తుల విలువ 11 కోట్ల 35 లక్షలు ఉండగా... భూములు, ప్లాట్లు, ఇల్లు ఇతరత్ర స్థిరాస్తులు మరో 8 కోట్ల వరకు ఉన్నట్లు గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు.ప్పుడు వాటి విలువ మరికొంచెం పెరిగి ఉండొచ్చు. గజపతిరాజులపై పోటీకి నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి సైతం ఏం సామాన్యుడు కాదు...ఆయన కూడా అదితి గజపతిరాజుకు సమానంగా ఆస్తి కలిగిన వాడే. గత ఎన్నికల్లో ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ 13.71 కోట్లు కాగా....అప్పు 3కోట్ల 85 లక్షల వరకు ఉంది. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం అన్నీ కలిపి 2 కోట్ల రూపాయల వరకు ఉండగా...భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. అదేస్థాయిలో ప్లాట్లు, కమర్షియల్ బిల్లిండులు, ఇల్లు కలిపి ఆయన ఆస్తుల విలువ 12 కోట్ల 15 లక్షల వరరకు ఉంది.మంత్రి బొత్స సత్యనారాయణఆస్తులు ఎనిమిదిన్నర కోట్లు ఉండగా...అప్పులు కోటిన్నర వరకు ఉన్నాయి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న బొత్స...పలుమార్లు మంత్రిగా పనిచేశారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, బంగారం, కార్లు, విలువ మొత్తం కలిపి 3కోట్ల 60 లక్షల వరకు ఉంది. వ్యవసాయ భూమితోపాటు విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్లాట్లు కొనుగోలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో మార్కెట్ విలువ తెలిపారు కానీ...ఇప్పుడు అక్కడ వాస్తవ విలువ చాలా ఎక్కువే ఉండి ఉంటుంది. అలాగే కమర్షియల్ బిల్డింగ్‌లు, ఇల్లు కలిపి మొత్తం విలువ 4 కోట్ల 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని అఫిడవిట్‌లో చూపారు. మొత్తంగా మంత్రి బొత్ససత్యనారాయణ ఆస్తులు విలువ 8.5 కోట్లు ఉన్నాయి. ఆయన, కుటుంబ సభ్యుల పేరిట వివిధ కంపెనీల పేరిట తీసుకున్న అప్పు కోటీ 45 లక్షల వరకు ఉంటుందని లెక్కల్లో చూపారు.బొత్స అప్పలనర్సయ్య విషయానికి వస్తే 5 కోట్ల 28 లక్షల విలువైన ఆస్తులు, 23 లక్షల అప్పులు ఉన్నాయి.డిపాజిట్లు, బంగారం, వాహనాల విలువ మొత్తం కలిపి కోటీ 80 లక్షల వరకు ఉండగా...వ్యవసాయ భూములు, ఇల్లు, ప్లాట్లు, కలిపి మరో మూడున్నర కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో తీసుకున్న 23లక్షల వరకు ఉంది. విజయనగరం ఎంపీగా పోటీచేస్తున్న బెల్లాన చంద్రశేఖర్‌కు 2 కోట్ల 10 లక్షల విలువైన ఆస్తులు ఉండగా.....అప్పులు కోటీ 11 లక్షల వరకు ఉన్నాయి.