YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పిఠాపురంలో అస్త్రాలు, శస్త్రాలు... సిద్ధం

పిఠాపురంలో అస్త్రాలు, శస్త్రాలు... సిద్ధం

కాకినాడ, మార్చి 23
పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో గెలిచి ఎన్నికల్లో బోణీ కొడతారా లేదా అన్న చర్చ ఏపీ మొత్తంలో కాకరేపుతోంది. ఆయన్ను ఎలాగైనా ఓడించాల్సిందే అని కంకణం కట్టుకుంది వైసీపీ. లక్ష మెజారిటీ అంటూ నువ్వు రెచ్చగొడితే మేం చూస్తూ ఊరుకుంటామా.. అనేది రివర్స్ ఛాలెంజ్. పవన్‌కి షాకివ్వడానికి వైసీపీ వేసిన తాజా పాచిక.. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు. మీరు లక్ష నోట్లు పంచినా నాకు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం.. అని రూలింగ్ పార్టీని డైరెక్ట్‌గా సవాల్ చేశారు పవన్ కల్యాణ్. దీంతో పిఠాపురం అసెంబ్లీ సీటు ఇంకాఇంకా హీటెక్కింది. తన ఫాలోయింగ్‌ను, తన ఫ్యాన్స్‌ని, తన ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి.. పిఠాపురం తనకు ఎంత ప్రతిష్టాత్మకమో చేతల్లోచూపిస్తున్నారు పవన్‌కల్యాణ్. కూటమిలో మిగతా పార్టీల క్యాడర్‌ని కూడా తన వైపు తిప్పుకున్నారు. పీకే సెట్టింగ్ ఇలా ఉంటే.. జగన్ ఫిట్టింగ్ మరోరేంజ్‌లో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆన్‌ది వే అంటోంది వైసీసీ.టికెట్ దక్కలేదని డీలా పడ్డ పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును సైతం లైన్లోకి తీసుకుంది వైసీపీ అధిష్టానం. సీఎంవో పిలుపుతో తాడేపల్లి వెళ్లిన దొరబాబు జగన్‌ని కలిశారు. పిఠాపురంలో గెలుపు మనకు చాలా ముఖ్యం, వంగాగీతని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందే అని సిట్టింగ్ ఎమ్మెల్యేకి టార్గెట్ పెట్టారు జగన్. మళ్లీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని జగన్ హామీ ఇవ్వడంతో సీరియస్‌గా వర్క్‌మోడ్‌లోకి వచ్చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే. పిఠాపురం ప్రస్తుత అభ్యర్థి వంగా గీతకు పూర్తి కోఆపరేషన్ ఇస్తూ.. తన అనుచర వర్గాన్ని ప్రచారంలో దింపారు పెండెం దొరబాబు. నాటోన్లీ కాపు సామాజికవర్గం.. అందరూ నావాళ్లే ఆంటూ సామాజిక సమీకరణాల్ని బ్యాలెన్స్ చేస్తూ పిఠాపురం మొత్తాన్ని రౌండప్ చేస్తున్నారు వంగా గీత. పిఠాపురంపై పవన్ పెట్టుకున్న కాన్ఫిడెన్స్ లెవల్స్‌ని చూసి.. ఆయన బద్ధ వ్యతిరేకులంతా ఒక్కటౌతున్నారు. పవన్ పేరు వింటేనే మండిపడే కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సైతం సీన్లోకొచ్చేశారు. ఆరునూరైనా పిఠాపురం మళ్లీ వైసీపీదే అనేది వీళ్లందరికున్న విశ్వాసం. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక.. రెండుచోట్లా ఓడించిన వైసీపీ.. ఈసారి కూడా పవన్‌కి పరాజయాన్ని రుచిచూపాలన్న పట్టుదలతో ఉంది. ఫస్ట్‌టైమ్ విక్టరీ కోసం సెట్టింగేసుకున్న పవన్‌, సిట్టింగ్ సీటు వదులుకోకూడదని వైసీపీ.. ఇలా పిఠాపురం చుట్టూ రాజకీయం రసవత్తరంగా మారింది.

Related Posts