YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జైలు నుంచి పాలన సాధ్యమేనా

జైలు నుంచి పాలన సాధ్యమేనా

న్యూఢిల్లీ, మార్చి 23,
మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయ్యారు. గురువారం సాయంత్రం సమయంలో సీఎం నివాసంలో ఈడీ బృందం ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. సీఎం పదవిలో కొనసాగుతుండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. . ఎన్డీయేయేతర పక్షాలన్నీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించాయి. అయితే, ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిషి మాట్లాడుతూ.. కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడగలరని చెప్పారు.  ఇది సాధ్యమేనా ? చట్టం ఏం చెబుతోంది ?ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన జైలు నుంచే పరిపాలన చేస్తారని ఆప్ వర్గాలు ప్రకటించాయి. సీఎం పదవిలో ఉంటూ అరస్టయిన మొదటి వ్యక్తిగా అరవింద్‌ కేజ్రీవాల్ నిలిచారు. గతంలో బీహార్‌ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్‌పై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అరస్టయిన హేమంత్‌ సోరెన్‌ కూడా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడే జయలలితకు శిక్ష పడింది. దీంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు. చట్టప్రకారం శిక్ష పడ్డాక పదవిని కోల్పోతారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం అనేది ఇబ్బందికరమైన విషయమే అయినా.. ముఖ్యమంత్రిని జైలు నుంచి పాలన చేయొద్దని అడ్డుకునే చట్టం, నియమం ఏదీ లేదు. అయితే, జైలుకు వెళితే.. జైలులో నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా జైలుకు వెళితే రాజీనామా చేయాల్సి ఉంటుందని ఎక్కడా పేర్కొనలేదు. చట్టం ప్రకారం.. ముఖ్యమంత్రి ఏదోఒక కేసులో దోషిగా తేలితేనే ఆయనపై అనర్హత వేటు పడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఎలాంటి శిక్షపడలేదు. ఒకవేళ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా కొనసాగుతారు. చట్టం ప్రకారం.. క్రిమినల్ కేసులో రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్షపడిన ఎమ్మెల్యే, ఎంపీపై అనర్హత వేటు పడుతుంది. కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయరని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్, మంత్రి అతిషితో పాటు పలువురు ఆప్ నేతలు చెబుతున్నారు. జైలులో ప్రతిదీ క్రమపద్దతిలో జరుగుతుంది. జైలు నియమాల ప్రకారం.. జైలులో ఉన్న ప్రతిఒక్కరు తన బంధువులు, స్నేహితులను వారానికి రెండు సార్లు కలిసే అవకాశం ఉంటుంది. జైలులో ఉన్నంతకాలం కోర్టు ఆదేశాలపైనే వ్యక్తి కార్యకలాపాలు కొనసాగుతాయి. తన న్యాయవాది ద్వారా ఏదైనా చట్టపరమైన పత్రంపై సంతకం చేయొచ్చు. కానీ, ఏదైనా ప్రభుత్వ పత్రంలో సంతకం చేయడానికి కోర్టు అనుమతి తప్పనిసరకేజ్రీవాల్ కు న్యాయపరమైన ఊరట లభించకపోతే  జైలులోనే ఉండాల్సి వస్తుంది.  సీఎంగా పరిపాలన చేయవచ్చు.  అయితే నైతిక పరంగా అయితే అది కరెక్ట్ కాదు.అందుకే గతంలో అరెస్ట్ కావాల్సిన వారు ముందుగానే రాజీనామా చేశారు. అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతను అరెస్టు చేయవచ్చా అంటే..  చట్టపరమైన అడ్డంకులేమీ లేవని.. రాజ్యాంగపరమైన రక్షణ ఏదీ లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.  రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్‌ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. కాబట్టి, ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి చట్టపరంగా అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్తున్నారు.కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవనున్నాయనే పరిస్థితులపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది.  గతంలో ముఖ్యమంత్రులు జైలు నుంచి బాధ్యతలు చేపట్టిన సందర్భం లేదని తెలిపారు. జైలు నిబంధనల్లో అలాంటి ప్రస్తావన లేదని, జైలులో ప్రతిదీ మాన్యువల్ ప్రకారం జరుగుతుందని ఆయన వివరించారు. కాగా ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. ఆయన అరెస్టు అయిన తర్వాత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.  ఢిల్లీలో ప్రజా ప్రభుత్వమే ఉన్నప్పటికీ..  అధికారాలు పరిమితం.  ప్రతీ విషయంలోనూ ఎల్జీ తీసుకునే నిర్ణయం కీలకం. ఇప్పుడు ఎల్జీ ఏం చేస్తారన్నది ఆసక్తికరం.

Related Posts