YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చక్కర్లు కొడుతున్న జెట్ విమానం

చక్కర్లు కొడుతున్న జెట్ విమానం

కరీంనగర్, మార్చి 23
విమానం ఆకాశంలో వెళ్తుంది అంటేనే ఆశ్చర్యంగా చూస్తాం. ఇక మన ఊరికి హెలిక్యాప్టర్‌ వచ్చిందంటే ఎవరు వచ్చారని ఆరా తీస్తాం. ఎందుకంటే దగ్గర నుంచి చూడడం చాలా మందికి వీలు కాదు. అయితే.. ఆ జిల్లాలో మాత్రం ఓ జెట్‌ విమానం వారం రోజులుగా చెక్కర్లు కొడుతోంది. అది కూడా తక్కువ ఎత్తులో తిరుగుతోంది. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఆ జిల్లా అటవీ జిల్లా కావడం కూడా భయానికి కారణం.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, మంథని అటవీ ప్రాంతాలతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల చెన్నూర్‌ అటవీ ప్రాంతాల్లో ఓ జెట్‌ విమానం వారం రోజులుగా చెక్కర్లు కొడుతోంది. ఇళ్లపై నుంచే వెళ్తోంది. దీంతో అసలు ఈ విమానం ఎందుకు తిరుగుతుందని రెండు జిల్లాల అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ విమానాన్ని ఎవరు పంపించారు, ఎందుకు వారం రోజులుగా ఇక్కడే తిరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొందరు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరుగుతుందని టెన్షన్‌ పడుతున్నారు.మరోవైపు నాలుగు రోజుల క్రితం సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ క్రమంలో జెట్‌ విమానం ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో చెక్కర్లు కొడుతుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాల్లో మావోయిస్టులు ఎవరైనా ఉన్నారా.. అని అనుమానిస్తున్నారు. వారికోసమే జెట్‌ విమానం తిరుగుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక మరో అనుమానం కూడా స్థానికులకు కలుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రాజెక్టుల అధ్యయన సంస్థ కాళేశ్వరం డ్యామేజీపై సర్వే చేసింది. ఇటీవలే సర్వే పూర్తి చేసి అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో జెట్‌ ఇక్కడ చెక్కర్లు కొట్టడం కేంద్ర ప్రభుత్వం పంపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక కొందరు ఈ జెట్‌ విమానాన్ని సింగరేణి సంస్థ తిప్పుతోందని చాలా మంది పేర్కొంటున్నారు. బొగ్గు సర్వే కోసం, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల విస్తరణ కోసం ఈ జెట్‌ విమానంతో సర్వే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.

Related Posts