YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రెడీ... స్టడీ ..గో.. లిస్ట్ సిద్ధం..

రెడీ... స్టడీ ..గో.. లిస్ట్ సిద్ధం..

హైదరాబాద్, మార్చి 23
లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇంకా 8 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఈ 8 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. అభ్యర్థులపై దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఇక ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ 13 స్థానాలకు, బీజేపీ 15 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని ఖరారు చేసిన బీఆర్ఎస్.. మిగిలిన 4 స్థానాల్లో హైదరాబాద్ మినహా నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ పై దాదాపు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీజేపీ కూడా పెండింగ్ లో పెట్టిన వరంగల్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, ఖమ్మం స్థానాన్ని టీడీపీ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడినందున తెలంగాణలోనూ ఆ బంధం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు వీరే?
కాంగ్రెస్
హైదరాబాద్ – షహనాజ్ తుబ్బం
ఆదిలాబాద్ – ఆత్రం సుగుణ
కరీంనగర్ – ప్రవీణ్ రెడ్డి
భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి
మెదక్ – నీలం మధు
వరంగల్ – పసునూరి దయాకర్
ఖమ్మం – పొంగులేటి ప్రసాద్ రెడ్డి
నిజామాబాద్ – జీవన్ రెడ్డి
బీఆర్ఎస్
భువనగిరి – బూడిద భిక్షమయ్య గౌడ్
నల్గొండ – తేరా చిన్నపురెడ్డి
సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్
బీజేపీ
ఖమ్మం – జలగం వెంకటరావు
వరంగల్ – ఆరూరి రమేశ్

Related Posts