YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గుండెపోటుతో... ఉన్నా... ప్రాణాలు కాపాడాడు

గుండెపోటుతో... ఉన్నా... ప్రాణాలు కాపాడాడు

విజయవాడ, మార్చి 23
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతిచెందాడు. కానీ.. ఆయన చూపిన ముందుజాగ్రత్త, సమయస్ఫూర్తి వల్ల... బస్సులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. తన ప్రాణం మీదకు వచ్చినా కూడా ఆర్టీసీ డ్రైవర్‌  బస్సులోని ప్రయాణికుల గురించి ఆలోచించాడు. గుండెపోటుతో బాధపడుతూ కూడా బస్సును జాగ్రతగా పక్కకు ఆపాడు. ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. హైవే అంబులెన్స్‌ సిబ్బంది గుర్తించి అతనికి సీపీఆర్‌  చేశారు. వెంటనే ఆస్పత్రికి  తరలించారు. అత్యవసరంగా ప్రథమ చికిత్స చేశారు. కానీ.... ఆ డ్రైవర్‌ ప్రాణం నిలబడలేదు. ఆస్పత్రికి వెళ్లిన కొన్ని క్షణాలకే ఆయన మృతిచెందాడు.ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగింది ఈ విషాదకర సంఘటన. పెళ్లి బృందంతో వెళ్తోంది ఆర్టీసీ బస్సు. వత్సవాయి మండలం గట్టు భీమవరం టోల్‌ప్లాజా దగ్గర రాగానే... ఆ బస్సులోని డ్రైవర్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీలో నొప్పి రావడంతో  భరించలేకపోయాడు. అంత నొప్పిలోనూ... బస్సులోని ప్రయాణికుల గురించి ఆలోచించాడు ఆ డ్రైవర్‌. గుండెల్లో నొప్పి బాధిస్తున్నా... నెమ్మదిగా బస్సును రహదారి పక్కగా ఆపాడు. ఏం జరిగిందని ప్రయాణికులు గమనించేలోపే... స్ట్రీరింగ్‌ ముందు  కుప్పకూలిపోయాడు. బస్సులోని ప్రయాణికులు... అటువైపు వెళ్తున్న హైవే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అతనికి సీపీఆర్‌ చేశారు. పరిస్థితి విషమంగా ఉందని గమనించి... వెంటనే సమీపంలోని జగ్గయ్యపేట ఆస్పత్రికి  తరలించారు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు... ఆర్టీసీ డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స చేశారు. కానీ... ఆయన ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఆస్పత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే ఆర్టీసీ డ్రైవర్‌ ప్రాణాలు వదిలాడు.నల్లగొండ జిల్లా మిర్యాగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఒక పెళ్లి బృందం బుక్‌ చేసుకుంది. ఆ బస్సు నెంబర్‌ TS05Z0217. విజయవాడలో వివాహం ఉండటంతో... పెళ్లి బృందం మిర్యాలగూడ డిపో బస్సును బుక్‌ చేసుకుని. విజయవాడ వెళ్లి... పెళ్లి ముగిసిన తర్వాత అదే బస్సులో తిరిగి వచ్చేలా ప్లాన్‌ చేసుకున్నారు. మిర్యాలగూడ నుంచి విజయవాడకు వెళ్లారు. అక్కడ పెళ్లి వేడుక ముగిసిన తర్వాత... పెళ్లివారి బంధువులు అందరూ కలిసి మళ్లీ అదే బస్సులో.. మిర్యాలగూడ తిరుగుప్రయాణం అయ్యారు. మార్గం మధ్యలో ఆ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించి... బస్సును పక్కకు ఆపకపోయిఉంటే... ఏం జరిగేదో చెప్పలేం. కానీ ఆర్టీసీ డ్రైవర్‌.. తన ప్రాణాల మీదకు వచ్చినా... బస్సులోని ప్రయాణికుల గురించి ఆలోచించారు. బస్సును పక్కకు ఆపడంతో.. పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఇళ్లకు చేరారు. కానీ... బస్సు డ్రైవర్‌ మాత్రం గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.

Related Posts