YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అకౌంట్లు స్తంభింపచేసి.. ఆర్థిక ఇబ్బందులు పెట్టి... కాంగ్రెస్ ను అణగదొక్కాలనే ప్రయత్నం

అకౌంట్లు స్తంభింపచేసి.. ఆర్థిక ఇబ్బందులు పెట్టి... కాంగ్రెస్ ను అణగదొక్కాలనే ప్రయత్నం

విజయవాడ
దేశంలో కాంగ్రెస్ ఉనికే లేకుండా చేయాలనే కుటిల ప్రయత్నాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడూ చూడని అత్యంత నీచమైన పాలనను ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించి, దేశాన్ని అన్ని విధాలా పురోగమన పధంలో నడిపించిన కాంగ్రెస్ పార్టీ.. బ్యాంక్ ఎకౌంట్లను స్తంభింపచేయడం దారుణమైన విషయం అని తెలిపారు. అవినీతి నిరోధానికి, చట్ట వ్యతిరేక చర్యలను ఆపడానికి వినియోగించాల్సిన ఐటీ, ఈడీ, సీబీఐ వంటి జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాజకీయంగా వాటిని దుర్వినియోగం చేస్తుందని ఆయన వెల్లడించారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో... బ్యాంక్ అకౌంట్లను స్తంభింప చేయడం ద్వారా  కాంగ్రెస్ ను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి, పార్టీని అణగదొక్కాలని కొందరు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసలు దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో.. గత 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో.. దేశంలో అసమానతలు పెరిగిపోయాయని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ గణాంకాల ప్రకారం 2022-23 సంవత్సరాంతానికి, దేశ ఆదాయంలో 22.6 శాతం, దేశ సంపదలో 40 శాతం... కేవలం ఒక్క శాతం ప్రజల వద్ద మాత్రమే పేరుకుపోయిందని వాపోయారు. ఇదే పరిస్థితులు కొనసాగితే పేద, ధనిక తారతమ్యంతో అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. అనేక సామాజిక అంశాలపై పేదల పక్షాన పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని.. కాంగ్రెస్ పార్టీపై అనేక విధాలుగా బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తుందని స్పష్టం చేశారు. దేశ ప్రజల సంపద అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వందల కోట్ల రూపాయిల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సరిగా అందజేయకుండా... బీజేపీ ప్రభుత్వానికి దాసోహం అయ్యిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలతో పాటు అధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే విధంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బలపరచాలని సీడ్ల్యుసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కోరారు.

Related Posts