YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ 68 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

ఆ 68 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

విజయవాడ, మార్చి 26,
పీలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. అటు విపక్షాలు కూటమి కట్టాయి. బలమైన అభ్యర్థులను బరిలో దించుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాయలసీమలో ఎట్టి పరిస్థితుల్లో పట్టు తగ్గకూడదని భావిస్తున్నారు. కోస్తా తో పాటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా 68 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. ఏకపక్షంగా విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23స్థానాలకు పరిమితమైంది.జనసేన ఒకచోట విజయం సాధించింది. అంటే ఆ 24 స్థానాలతో పాటు పదివేల కంటే తక్కువ మెజారిటీ ఉన్న స్థానాలు 44 వరకు ఉన్నాయి. అటు విపక్షాలు గెలిచిన సీట్లతో పాటు తక్కువ మెజారిటీ దక్కిన స్థానాలను కలుపుకుంటే.. 68 అసెంబ్లీ సీట్లు అన్నమాట. అయితే ఈ 44 స్థానాల్లో 5000 కంటే తక్కువ మెజారిటీ సాధించిన స్థానాలు 12 ఉన్నాయి. మరో 32 మంది ఎమ్మెల్యేలు ఐదువేల నుంచి పదివేల మధ్య మెజారిటీ దక్కించుకున్నారు. ఈ 68 స్థానాలను కాపాడుకోకపోతే అధికారానికి దూరం కావడం ఖాయమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.ముఖ్యంగా 5000 కంటే తక్కువ మెజారిటీ వచ్చిన 12 నియోజకవర్గాల్లో వైసిపి అపాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే.. విజయవాడ సెంట్రల్ 25, తిరుపతి 708, పొన్నూరు 1112, నెల్లూరు సిటీ 1988, తణుకు 2195, నగిరి 2708, కొత్తపేట 4038,ఏలూరు 4072, ఎలమంచిలి 4146, తాడికొండ 4433, ప్రత్తిపాడు 4611, జగ్గయ్యపేట 4778 ఓట్ల మెజారిటీ మాత్రమే వైసీపీకి దక్కింది.పదివేల లోపు మెజారిటీ దక్కించుకున్న స్థానాలను పరిశీలిస్తే రామచంద్రపురం 5168, మంగళగిరి 5337, కర్నూలు 5353, ముమ్మిడివరం 5547, శ్రీకాకుళం 5777, మచిలీపట్నం 5851, విజయనగరం 6417, నరసాపురం 6436, ప్రత్తిపాడు 7398, తాడిపత్రి 7511, విజయవాడ వెస్ట్ 7671, పెడన 7839, పీలేరు 7874, అనకాపల్లి 8169, చిలకలూరిపేట 8301, బొబ్బిలి 8352, భీమవరం 8357, కాకినాడ రూరల్ 8789, సంతనూతలపాడు 9078, కైకలూరు 9357, భీమిలి 9712, వేమూరు 9999ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది.అందుకే ఈ 34 నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

Related Posts