రెండవ రోజు కూడా బ్యాంకులు మూతపడ్డాయి. ఉద్యోగుల జీతాలు పెంచడంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరశిస్తూ 48 గంటల బంద్ కు పలిపు నిచ్చారు. ఇందులో భాగంగా విజయవాడలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేసారు. సూర్యరావుపేటలోని ఎస్.బి.ఐ. సెంట్రల్ కార్యాలయం వద్ద వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ధర్నాలో పాల్గోన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యపై సానుకూలంగా స్పందించకపోతే, భవిష్యుత్తులో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు... బ్యాంకులు నిరవధిక సమ్మెలోకి వెళ్లితే దేశ ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు