YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కడిగిన ముత్యంలా బయటకు వస్తా

కడిగిన ముత్యంలా బయటకు వస్తా

న్యూఢిల్లీ
జై తెలంగాణ జై కేసిఆర్.. కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. తాత్కాలికంగా జైల్లో పెడతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం నాడు రౌస్ అవెన్యూ కోర్టు లో ఆమెను ఈడీ ప్రవేశపెట్టింది. కోర్టు లోపలికి వెళ్లేముందు ఆమె కెమెరాల ముందు మాట్లాడారు. మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. ఇది తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీ లో చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమి లో పోటీ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీ 50 కోట్ల విరాళాలు ఇచ్చారని ఆమె అన్నారు. నేను క్లీన్ గా బయటకు వస్తా. అప్రూవర్ గా  మారేది లేదని అన్నారు.

పొలిటికల్ ల్యాండరింగ్ లో  బుక్ చేశారు
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ టైంలో మీడియాతో మాట్లాడిన ఆమె... కేంద్రంపై, దర్యాప్తు అధికారుల సంచలన ఆరోపణలు చేశారు. కోర్టుకు వెళ్తున్న టైంలో జై తెలంగాణ.. జై కేసిఆర్ అంటు నినదించిన కవిత ఏమన్నారంటే..." కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. తాత్కాలికంగా జైల్లో పెడతారు. మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీలో చేరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమిలో పోటీ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీ 50 కోట్ల విరాళాలు ఇచ్చారు. " అంటు విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని వివరాలు కవితను అడిగి తెలుసుకోవాల్సి ఉందని... మరో 14 రోజుల రిమాండ్‌కు ఇవ్వానలి రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా 14 రోజుల రిమాండ్‌కు ఇచ్చింది న్యాయస్థానం. బెయిల్ ఇవ్వాలని లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టు అయిన కవిత కోర్టుకు విన్నవించుకున్నారు. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుకు రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. దీనికి కౌంటర్‌గా ఈడీ అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజ్వర్‌ చేశారు.

Related Posts