YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పోగాకుతో జాగ్రత్త

పోగాకుతో జాగ్రత్త
పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన కేన్సర్ వంటి వ్యాధులు సంభవించి మరణానికి దగ్గర అయ్యే ప్రమాదం ఉన్నదని జిల్లా కలెక్టరు డా. కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక ఇండోర్ స్టేడియంలో ప్రపంచ టుబాకో నివారణాదినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ర్యాలీని కలెక్టరు ప్రారంభించారు. ఈసందర్భంగా డా. భాస్కర్ మాట్లాడుతూ సిగరెట్లు, పాన్ పరాగ్, గుట్కా, గంజాయివంటి మత్తు పదార్ధాల వినియోగం వల్ల చిన్నవయస్సులోనే మరణానికి దగ్గర అయ్యే ప్రమాదం ఉన్నదని ముఖ్యంగా వీటి వినియోగం వలన కేన్సర్ వంటి వ్యాధులు సంభవించి అకాల మరణానికి గురి అవుతున్నారని కలెక్టరు చెప్పారు. 18 సంవత్సరాలు లోపు పిల్లలకు టుబాకో ఉత్పత్తులు విక్రయించరాదని ధూమపానం వలన కేన్సర్ వంటి వ్యాధులు త్వరితగతిన సంభవించే అవకాశాలు ఉన్నాయని కలెక్టరు చెప్పారు. పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వలన సంభవించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలని ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసేవారిపై కేసులు నమోదు చేసి సమాజానికి హానికలిగించే చర్యగా తగిన శిక్ష విధించాలని కలెక్టరు చెప్పారు. పొగాకు ఉత్పత్తులు, గుట్కా, పాన్ పరాగ్, గంజాయి, తదితర మత్తు పదార్ధాల వినియోగం వలన కలిగే నష్టాలను తెలియజేసే విషయాన్ని ప్రముఖంగా ముద్రించాలని కలెక్టరు చెప్పారు. ఎ మ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ జిల్లాలో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తి స్ధాయిలో నిరోధించేలా ఎ వరికి వారే స్వీయ నియంత్రణ జరపాలని ముఖ్యంగా మహిళలు చుట్టలు త్రాగే విధానం వలన అనేక జబ్బులతోపాటు కేన్సర్ వ్యాధికి గురి అయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఈకార్యక్రమంలో డియంహెచ్ఓ డా. బి. సుబ్రహ్మణ్ శ్వరి, డిఇఓ సిఏ. రేణుక, ఐసిడియస్ పిడి విజయకుమారి, డిసిహెచ్‌యస్ డా. శంకరరావు, ఏలూరు నగరపాలక సంస్ధ కమిషనరు మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈర్యాలీ జిల్లా పరిషత్తు అతిథిగృహం మీదుగా ఆర్అండ్‌బి ఆఫీస్ పైర్ స్టేషన్ సెంటరుకు చేరుకుంది. 

Related Posts