YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోజురోజుకి మారుతున్న ఏలూరు రాజకీయాలు

రోజురోజుకి మారుతున్న ఏలూరు రాజకీయాలు

ఏలూరు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నియోజకవర్గంలో  రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ  రసవత్తరం గా మారింది .. నిన్నటి వరకు అధికారపార్టీ లో ఉన్న వారు నేడు ప్రతిపక్ష పార్టీ కండువా కప్పుకొని తిరుగుతున్నారు .. అధికార పార్టీ జెండా తో గెలిచి అదే అధికారపార్టీ నిర్ణయాలను ఎండగడుతున్నారు .. ఇటీవలే అధికార పార్టీ కి చెందిన కార్పొరేటర్లు కర్రీ శ్రీనివాస్ , పప్పు ఉమా మహేశ్వర రావు లు ఏలూరు ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి తీరు తమను బాధిస్తుంది అంటూ ఏలూరు లో నిరసన గళం లేవనెత్తారు కొంతమంది కార్పొరేటర్ లు .. వీరికి మరికొంతమంది మాజీలు కూడా తోడవడం తో ఇప్పుడు ఏలూరు లో అధికారపార్టీ ఇరుకున పడింది అంటున్నారు .. ఎక్కడయినా ప్రతిపక్షం లో నుండి అధికార పక్షం వైపు వెళ్తుంటారు కానీ ఏలూరు లో దీనికి భిన్నం గా ప్రతిపక్షం లోకి వెళ్లడం అధికార పార్టీ కి నష్టం చేకూర్చే అంశం గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు .. వీరి బాట లోనే మరికొంతమంది మాజీ కార్పొరేటర్ కవులూరి చంద్రశేఖర్ , మాగంటి హేమ సుందర్ ఉమ్మడి పార్టీ అభ్యర్థి బడేటి చంటి అద్వర్యం లో లోకేష్ సమక్షం లో టిడిపి కండువా కప్పుకొని ఏలూరు అధికార పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు .. టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి గా బడేటి చంటి పేరు ప్రకటించగానే అయన ప్రచారాన్నీ వేగవంతం చేయడం తో పాటు ఏలూరులో గెలుపొందేందుకు ప్రణాళిక బద్దం గా పావులు కదుపుతున్నారు .. మీడియాకు దూరం గా , రాజకీయ విమర్శలు అసలు ఇష్టపడని వివాద రహితుడిగా పేరున్న ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని తమకు అస్సలు ఉపయోగపడలేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు
ఇక రావులపాలెం కు చెందిన ఓ ప్రముఖ  కాంట్రాక్టర్  ప్రజల ఇల్లు కట్టిస్తానని మోసం చేసి వెళ్ళిపోతే అది ఎమ్మెల్యే నాని ద్రుష్టి కి తీసుకు వెళ్లిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా ఇదే అంశాన్ని ఏలూరు ఉమ్మడి పార్టీ అభ్యర్థి బడేటి చంటి తనకు అనుకూలం గా మార్చుకుంటున్నారు.. అధికార పార్టీ పై అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకుల్ని , కార్పొరేటర్ లను కలుస్తూ తమ పార్టీ లో చేరాలని ఆహ్వానిస్తున్నారు .. తన అన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి రాజకీయ వారసత్వాన్న్ని కొనసాగింపు గా తనకు ఒక్క చాన్సు ఇవ్వాలి  అంటూ నాయకుల్ని తన వైపు తిప్పుకొనే  ప్రయత్నం చేస్తున్నారు .. ఇప్పటికే ఏలూరు సీటు జనసేన కి రాలేదని తీవ్ర అసంతృపిలో ఉన్న రెడ్డి అప్పలనాయుడు ఏలూరు లో టిడిపి కి సహకరిస్తామని ప్రకటించారు ..
ఇటు టిడిపి నేతలు సైతం తమ నాయకులూ అధికార పార్టీ వైపు ఆకర్షితులు అవకుండా రాబోయేధీ తమ ప్రభుత్వమే అని అనుక్షణం గుర్తు చేస్తున్నారు. అధికార పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు బాగా తెలిసినవారు కావడం అందులోనూ అధికార పార్టీ లూప్ హోల్స్ బాగా తెలిసినవాళ్ళు కావడం తో అధికార పార్టీ నేతలు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Related Posts