YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ కుటుంబం తో పోటీ సాధ్యమేనా

వైఎస్ కుటుంబం తో పోటీ సాధ్యమేనా

కడప, మార్చి 28 
కడప జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబమే. దశాబ్దాలుగా జిల్లాను ఏకచత్రాధిపత్యంతో ఏలిన వైఎస్‌ కుటుంబంలో...ఇప్పుడు ఆయన వారసుడు జగన్ సైతం ఆ పట్టుకోల్పోకుండా రాజకీయం నెరుపుతున్నారు. వివిధ వ్యాపారాలు చేసిన జగన్ వందల కోట్లు కూడబెట్టారు. గత ఎన్నికల(2019) సమయంలో ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తుల విలువ 510 కోట్లు కాగా...అప్పులు 74 కోట్లు పైగానే ఉన్నట్లు తెలిపారు. వివిధ బ్యాంకుల్లో జగన్ పేరిట ఉన్న బాండ్లు విలువ నాలుగుకోట్లపైనే ఉండగా....వివిధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, షేర్ల విలువు 381 కోట్లుగా ఉంది. మూడున్నర కోట్ల పర్సనల్‌ లోను అడ్వాన్స్ రూపంలో తీసుకోగా...దాదాపు పదికోట్లు విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇతర మార్గాల్లో  ఆదాయం మరో 42 కోట్లు ఉంది. జగన్ మొత్తం చరాస్తుల విలువ 443 కోట్లు ఉంది. 70లక్షల విలువైన వ్యవసాయ భూమి ఉండగా...మరో 15 కోట్లు విలువైన వ్యవసాయేతర భూమి ఉంది. 24 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు, 25 కోట్ల విలువైన ఇళ్లు ఆయన పేరిట ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 66 కోట్లు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లింపులు కలిపి 74 కోట్లు వరకు ఉంది.జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ అభ్యర్థి పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డికి 40 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. 14కోట్లు అప్పులు ఉన్నాయి. బ్యాంకు బ్యాలెన్స్‌, బాండ్లు, షేర్లు కలిపి 10 కోట్ల రూపాయల ఆస్తి ఉండగా... పర్సనల్‌లోన్‌గా బ్యాంకు నుంచి 16 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. బంగారం, వాహనాలు అన్నీ కలిపి ఆయన చరాస్తుల విలువ 27 కోట్ల వరకు ఉంది. భూములు, ఇల్లు, స్థలాలు అన్నీ కలిపి పదమూడున్నర కోట్లు వరకు ఆస్తి ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 14 కోట్లు వరకు ఉంది. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆస్తులు దాదాపు 4 కోట్లు వరకు ఉన్నాయి. బాండ్లు, బ్యాంకులో క్యాష్, పర్సనల్‌ లోన్ అడ్వాన్స్‌లు కలిపి 2 కోట్ల 28లక్షలు  ఉన్నాయి. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూములు, ఇల్లు అన్నీ కలిపి మరో కోటీ 62 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు రాయచోటిఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ఆరున్నర కోట్ల ఆస్తులు, రెండు కోట్ల అప్పులు ఉన్నాయి. తెలుగుదేశం నేత పుట్టా సుధాకర్‌యాదవ్‌కు 66 కోట్ల ఆస్తులు ఉన్నాయి. బాండ్లు,షేర్లు విలువే 45 కోట్లు వరకు ఉండగా....మొత్తం చరాస్తులు కలిపి 47 కోట్లు ఆస్తి ఉంది. కోటి రూపాయల విలువైన వ్యవసాయ భూములు, రెండు కోట్లు విలువైన వ్యవసాయేతర భూములు, 9 కోట్లు విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు, 8 కోట్లు విలువైన ఇల్లు ఉన్నాయి. పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఎలాంటి అప్పులు లేవు. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి మూడుకోట్ల ఆస్తులు ఉండగా...9 లక్షల అప్పు ఉంది.కడప ఎంపీగా మరోసారి వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డికి దాదాపు 19 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రెండు కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఉన్న బాండ్లు కోటిన్నర వరకు ఉండగా... మరో రెండున్నర కోట్లు వరకు పర్సనల్‌లోన్ అడ్వాన్స్‌లు ఉన్నాయి. వాహనాలు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి మొత్తం చరాస్తుల విలువ 5 కోట్లు పైగానే ఉన్నాయి. 8కోట్లకు పైగా విలువైన వ్యవసాయ భూములు, కోటిరూపాయల విలువైన వ్యవసాయేతర భూమి ఉంది. నాలుగున్నర కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ పదమూడున్నర కోట్లు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి అవినాష్‌రెడ్డి తీసుకున్న అప్పు 2 కోట్ల 28 లక్షలు ఉంది.రాజంపేట నుంచి వైసీపీ తరపున బరిలో ఉన్న మిథున్‌రెడ్డికి 66.5 కోట్ల ఆస్తులు ఉండగా...20 కోట్ల అప్పు ఉంది. బాండ్లు, షేర్ల రూపంలో 9 కోట్లు, పర్సనల్‌లోనూ అడ్వాన్స్‌ ద్వారా మరో ఐదుకోట్లు ఆస్తి ఉంది. మిగిలినవి అన్నీ కలిపి మిథున్‌రెడ్డికి 14.66 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అలాగే 8 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, 16 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, హైదరాబాద్‌లో 28 కోట్ల విలువైన ఇల్లు మిథున్‌రెడ్డి పేరిట ఉన్నాయి. ఆయన మొత్తం స్థిరాస్తుల విలువ 52 కోట్లు వరకు ఉన్నాయి. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 20 కోట్లకుపైగానే ఉంది. ఇక మిథున్‌రెడ్డిపై పోటీపడుతున్న ఎన్డీఏ అభ్యర్థి మాజీముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తులు 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 18 కోట్లు వరకు ఉన్నాయి. ఆయన మొత్తం చరాస్తుల విలువ 5 కోట్లు ఉండగా...ఏడుకోట్ల విలువైన వ్యవసాయ భూములు, ఏడుకోట్ల విలువైన ఇల్లు ఆయన పేరిట ఉన్నాయి. మొత్తం స్థిరాస్తులు 14 కోట్లు ఉన్నాయి.

Related Posts