విజయవాడ, మార్చి 28
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మే 13న జరగనున్నాయి. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈసారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. ఈసారి గెలుపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదా..? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదా..? అన్నది ఓటర్ల చేతిలో ఉంది. మరి ఎన్నికల్లో... ఓట్లు వేసేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారా..? ఓటు ఉన్నవారంతా... పోలింగ్‌లో పాల్గొంటారా...? గత ఎన్నికల కంటే ఈసారి మెరుగైన పోలింగ్ శాతం నమోదవుతుందా...? అన్నది చూడాలి.
2019లో జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు...
2019 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో 69.5శాతం, పలాసలో 72.8శాతం, టెక్కలిలో 78.5శాతం, పాతపట్నంలో 70శాతం, శ్రీకాకుళంలో 69శాతం, ఆమదాలవలసలో 79శాతం, ఎచ్చెర్లలో 84శాతం, నరసన్నపేటలో 79.6శాతం, రాజాంలో 73.8శాతం, పాలకొండలో 73.9శాతం ఓటింగ్ నమోదైంది.
విజయనగరం జిల్లాలోని కురుపాంలో 77.7శాతం, పార్వతీపురంలో 76.9శాతం, సాలూరులో 79.4శాతం, బొబ్బిలిలో 78.9శాతం, చీపురుపల్లిలో 83.3శాతం, గజపతినగరంలో 86.9శాతం, నెల్లిమర్లలో 87.9శాతం, విజయనగరంలో 70.8శాతం, శృంగవరపుకోటలో 86.1శాతం రికార్డ్ అయ్యింది.
విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో 74.8శాతం, విశాఖ తూర్పులో 63.7శాతం, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 60శాతం, నార్త్ విశాఖలో 63శాతం, విశాఖ పశ్చిమలో 56.9శాతం, గాజువాకలో 64.2శాతం, చోడవరంలో 82.8శాతం, మాడుగులలో 82.9శాతం, అరకులోయలో 71.3శాతం, పాడేరులో 61.9శాతం, అనకాపల్లిలో 77.4శాతం, పెందుర్తిలో 74.5శాతం, యలమంచిలిలో 85శాతం, పాయకరావుపేటలో 81.3శాతం, నర్సీపట్నంలో 82.7శాతం పోలింగ్ నమోదైంది.
తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే... తునిలో 83.2శాతం, పత్తిపాడులో 81.3శాతం, పిఠాపురంలో 81.2శాతం, కాకినాడ రూరల్లో 74శాతం, పెద్దాపురంలో 80.6, అనపర్తిలో 87.4శాతం, కాకినాడ సిటీలో 67శాతం, రామచంద్రాపురంలో 87.1శాతం, ముమ్మిడివరంలో 83.6శాతం, అమలాపురంలో 83.1శాతం, రాజోలులో 80శాతం, గన్నవరంలో 82.4శాతం, కొత్తపేటలో 84.4శాతం, మండపేటలో 86.9శాతం, రాజానగరంలో 87.4శాతం, రాజమండ్రి సిటీలో 66.2శాతం, రాజమండ్రి రూరల్‌లో 74.2శాతం, జగ్గంపేటలో 85.6శాతం, రంపచోడవరంలో 77.4శాతం పోలీంగ్ నమోదైంది.
పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో 86.4శాతం, నిడదవోలులో 82.7శాతం, ఆచంటలో 79.6శాతం, పాలకొల్లులో 82.2శాతం, నరసాపురంలో 81.1శాతం, భీమవరంలో 77.9శాతం, ఉండిలో 84.7శాతం, తనుకులో 81.1శాతం, తాడేపల్లిగూడెంలో 80.3శాతం, ఉంగుటూరులో 86.8శాతం, దెందులూరులో 84.8శాతం, ఏలూరులో 67.6శాతం, గోపాలపురంలో 85.9శాతం, పోలవరంలో 86.8శాతం, చింతలపూడిలో 82.9శాతం పోలింగ్ నమోదైంది.
కృష్ణా జిల్లాలోని తిరువూరులో 86.3శాతం, నూజివీడులో 86.9శాతం, గన్నవరంలో 85.5శాతం, గుడివాడలో 80.5శాతం, కైకలూరులో 87.7శాతం, పెడనలో 87.7శాతం, మచిలీపట్నంలో 80.7శాతం, అవనిగడ్డలో 88.9శాతం, పామర్రులో 87.1శాతం, పెనమలూరులో 79.8శాతం, విజయవాడ పశ్చిమలో 66శాతం, విజయవాడ సెంట్రల్‌లో 65.9శాతం, విజయవాడ తూర్పులో 67.7శాతం, మైలవరంలో 82.8శాతం, నందిగామలో 87.4శాతం, జగ్గయ్యపేటలో 89.9శాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలోని పెదకూరపాడులో 88.8శాతం, తాడికొండలో 89.1శాతం, మంగళగిరిలో 85శాతం, పొన్నూరులో 83.6శాతం, వేమూరులో 87.8శాతం, రేపల్లెలో 83.1శాతం, తెనాలిలో 78.1శాతం, బాపట్లలో 83శాతం, ప్రత్తిపాడులో 83.9శాతం, గుంటూరు పశ్చిమలో 65.8శాతం, గుంటూరు తూర్పులో 70.2శాతం, చిలకలూరిపేటలో 83.9శాతం, నరసరావుపేటలో 88.1శాతం, సత్తెనపల్లెలో 88.8శాతం, వినుకొండలో 88.8శాతం, గురజాలలో్ 83.8శాతం, మాచర్లలో 84.6శాతం నమోదైంది.
ప్రకాశం జిల్లాలోపి ఎర్రగొండపాలెంలో 87.9శాతం, దర్శిలో 91.1శాతం, పర్చూరులో 89.4శాతం, అద్దంకిలో 88.2శాతం, చీరాలలో 82.5శాతం, సంతనూతలపాడులో 85.2శాతం, ఒంగోలులో 84.5శాతం, కందుకూరులో 89.4శాతం, కొండపిలో 87.7శాతం, మార్కాపురంలో 84.5శాతం, గిద్దలూరులో 82.3శాతం, కనిగిరిలో 83శాతం ఓటింగ్ నమోదైంది.
నెల్లూరు జిల్లాలోనూ 80శాతం వరకు పోలింగ్ నమోదైంది. కావలిలో 76.3శాతం, ఆత్మకూరులో 83.3శాతం, కోవూరులో 77.6శాతం, నెల్లూరు సిటీలో 66.3శాతం, నెల్లూరు రూరల్‌లో 65.2శాతం, సర్వేపల్లిలో 82.1శాతం , గూడురులో 77.8శాతం, సూళ్లూరుపేటలో 83.2శాతం, వెంకటగిరిలో 79.3శాతం, ఉదయగిరిలో 80.3శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.
వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని బద్వేల్‌లో 76.3శాతం, రాజంపేటలో 74.1శాతం, కడపలో 62.8శాతం, కోడూరులో 74.8శాతం, రాయచోటిలో 74.9శాతం, పులివెందులలో 89.5శాతం, కమలాపురంలో 81.9శాతం, జమ్మలమడుగులో 85.7శాతం, ప్రొద్దుటూరులో 76.9శాతం, మైదుకూరులో 81.3శాతం ఓట్లు పోలయ్యాయి.
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో 83.9శాతం, శ్రీశైలంలో 82.4శాతం, నందికొట్కూరులో 87.2శాతం, కర్నూలులో 58.9శాతం, పాణ్యంలో 74.8శాతం, నంద్యాలలో 76.8శాతం, బనగానపల్లెలో 83.4శాతం, డోన్‌లో 79.3శాతం, పత్తికొండలో 81.5శాతం, కోడుమూరులో 77.6శాతం, ఎమ్మిగనూరులో 79.6శాతం, మంత్రాలయంలో 85.1శాతం, అదోనిలో 65.4శాతం, ఆలూరులో 80.1శాతం నమోదైంది.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో 86.5శాతం, ఉరవకొండలో 86.4శాతం, గుంతకల్లులో 75.6 శాతం, తాడిపత్రిలో 79.9శాతం, శింగనమలలో 83.8శాతం, అనంతపురం అర్బన్‌లో 64.5శాతం, కళ్యాణదుర్గంలో 86.8శాతం, రాప్తాడులో 82.2శాతం, మడకశిరలో 87.7శాతం, హిందూపురంలో 77.6శాతం, పెనుకొండలో 85.7శాతం, పుట్టపర్తిలో 85.6శాతం, ధర్మవరంలో 87.5శాతం, కదిరిలో 79.1శాతం పోలింగ్ నమోదైంది.
చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో 84.4శాతం, పీలేరులో 79.6శాతం, మదనపల్లెలో 73శాతం, పుంగనూరులో 85.2శాతం, చంద్రగిరిలో 78శాతం, తిరుపతిలో 66.6శాతం, శ్రీకాళహస్తిలో 82.4శాతం, సత్యవేడులో 86.8శాతం, నగరిలో 86.5శాతం, గంగాధర నెల్లూరులో 86.3శాతం, చిత్తూరులో 78.1శాతం, పూతలపట్టులో 86.4శాతం, పలమనేరులో 85.5శాతం, కుప్పంలో 85శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.
2014లో పోలింగ్ శాతం వివరాలు...
2014లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.64 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలైన... శ్రీకాకుళంలో 75.25శాతం, విజయనగరంలో 79.90శాతం, విశాఖపట్నంలో 72.27శాతం, తూర్పుగోదావరిలో 79.53శాతం, పశ్చిమగోదావరిలో 83.36శాతం, కృష్ణా జిల్లాలో 80.73శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే.. గుంటూరులో 82.25శాతం, ప్రకాశంలో 83.99శాతం, నెల్లూరులో 75.26శాతం, కడపలో 77.51శాతం, కర్నూలులో 74.46శాతం, అనంతపురంలో 80.30శాతం, చిత్తూరులో 79.12శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.
2024లో పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ ప్రయత్నాలు
2014లో 74.64శాతం... 2019లో 79 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈసారి... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. గత ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలు, అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను గుర్తించాలని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. తక్కువ శాతం పోలింగ్ నమోదవడానికి కారణాలను విశ్లేషించి పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల భాగస్వామ్యం పెంచేలా చర్యలను చేపట్టాలని సూచించింది. అలాగే, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు, నిరాశ్రయులైన వివిధ అట్టడుగు వర్గాలు, సంచార సమూహాలను.... గుర్తించి వారందరినీ పోలింగ్‌లో భాగస్వామ్యం చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపింది. ఒక్క ఓటరును కూడా వదలకుండా చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టాలని తెలిపింది ఈసీ.
ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగగా ప్రచారం చేయాలని భావిస్తోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఓటరు ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 85ఏళ్ల పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లు... పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేలా చూడాలని తెలిపింది. ఏపీలో రాష్ట్రంలో 85ఏళ్లు పైబడిన ఓటర్లు 2లక్షల మందికిపైగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం అనేది వారి ఇష్టం. పోలింగ్ కేంద్రానికి వచ్చి కూడా ఓటు వేయవచ్చు. అలాగే, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోం ఓటింగ్‌కు చేసేందుకు అవకాశం ఉంటుంది.