YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

పక్కా ప్లాన్ తో బడిబాట

పక్కా ప్లాన్ తో బడిబాట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జూన్‌ 4 నుంచి 8వ తేదీ వరకు బడిబాటకార్యక్రమం నిర్వహించనున్నారు విద్యావిభాగం అధికారులు. ప్రతి రోజూ ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఉపాధ్యాయులను రెడీ చేస్తోంది సర్కార్. జూన్‌ 1వ తేదీ నాటికే పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించేందుకు చర్యలు కూడా మొదలుపెట్టింది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలను, ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలకు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయటం బడిబాట కార్యక్రమ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.  ప్రభుత్వ ఉపాధ్యాయుల అర్హతలు, ఇతర వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు సహకారం తీసుకోనున్నారు. 
 
బడిబాట ప్రోగ్రాంలో పాఠశాల విద్యా కమిటీలు, డ్వాక్రా సంఘాలు, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల్ని కూడా భాగస్వాముల్ని చేయనున్నారు. వివిధ స్థాయిల్లోని అధికారులకు కూడా బాధ్యతలు అప్పగిస్తారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాల గురించి ఎంఈవోలకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. బుడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, కల్పించాల్సిన ఇతర సౌకర్యాల గురించి కరపత్రాలు, గోడపత్రికలు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది కంటే 10శాతం అధికంగా పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. బడిబయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించే బాధ్యత సంబంధిత ప్రధానోపాధ్యాయులే చేయనున్నారు. పిల్లను గుర్తించటంతోపాటు పాఠశాలలో విధిగా చేర్పించాల్సిన డ్యూటీ కూడా వారిదే అని సమాచారం. ఐదేళ్లలోపు పిల్లలు అంగన్‌వాడీల్లో ఎక్కువగా ఉంటున్నందున వారందర్నీ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను కూడా ప్రధానోపాధ్యాయులే చూసుకుంటారు. ఏదేమైనా సర్కారీ బడుల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు భద్రాద్రి విద్యావిభాగం పెద్ద ఎత్తునే కృషి చేస్తోంది. అధికారులు, ఉపాధ్యాయుల యత్నాలు ఫలించి పిల్లలు బడుల్లో చేరితే స్థానికంగా అక్షరాస్యత శాతం మరింతగా పెరుగుతుందని అంతా భావిస్తున్నారు.

Related Posts