YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతిపక్ష కూటమిలో ఆగని ఆందోళనలు

ప్రతిపక్ష కూటమిలో ఆగని ఆందోళనలు

ఏలూరు, మార్చి 29,
ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్‌ నాయకులు తమకు టికెట్‌ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. సేమ్‌ ఇలాంటి సీనే జరిగింది అనపర్తిలో. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో… మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే సీటు గల్లంతవ్వడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. కట్టప్ప రాజకీయాలు వద్దంటూ నినాదాలు చేశారు. తీవ్ర మనస్తాపానికి గురై ఓ కార్యకర్త ఇంటి పైనుంచే దూకే ప్రయత్నం చేయగా… ఇంకో వ్యక్తి పెట్రోల్‌ పోలీసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.ఇక అధిష్టానం నిర్ణయం మార్చుకుని తనకు సీటు కేటాయించాలని డిమాండ్‌ చేశారు నల్లమిల్లి. మరోవైపు కొడుకుకి సీటు రాకపోవడంతో… ఆయన తల్లి సైతం కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీ బద్వేల్ సీటు ఆశించిన పనతల సురేష్‌కు పార్టీ షాకివ్వడంతో… ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. విజయవాడలోని పార్టీ ఆఫీసు ఎదుట ఫ్లకార్డులతో బైఠాయించి ఆందోళన చేశారు. ఇటు అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ పొత్తు రాజకీయాలు వేడెక్కాయి. పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్‌ను బీజేపీకి కేటాయించడంతో టీడీపీ, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. వరదాపురం సూరి, పరిటాల శ్రీరామ్‌ అనుచరులు నిరసనకు దిగారు.సీటు రాలేదని నేతలు నిప్పులు చెరుగుతుంటే… మరోవైపు సర్ధుబాట్లు చోటుచేసుకున్నారు. మొన్నటివరకు తిరుపతి టికెట్‌ ఇవ్వలేదంటూ ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సడెన్‌గా కూల్‌ అయ్యారు. సీటు విషయంలో వెనక్కి తగ్గారామె.. కూటమి అభ్యర్థికి సపోర్ట్‌ చేస్తానంటూ శాంతించారు సుగుణమ్మ. కూటమిలో సీట్ల ఫైట్‌పై బీజేపీ ఏపీ చీఫ్‌ పురందేశ్వరి స్పందించారు. టికెట్‌ ఆశించి రాకపోతే ఎవరైనా ఆందోళనకు గురికావడం కామన్‌ అన్నారు. ఎవరెలా నిరసనకు దిగినా అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అన్నారామె. మొత్తంగా… సీట్ల పంపకాల విషయం కూటమిలో అగ్గిరాజేస్తోంది. సీటు కావాల్సిందేనని కొందరు పట్టుబట్టి ఆందోళనలకు దిగుతుంటే.. మరికొందరు కాంప్రమైజ్‌ అయ్యి కూటమి అభ్యర్థినే సమర్థిస్తున్నారు.
భూపతి రాజు ఎమోషనల్
భావోద్వేగానికి ఎవరూ అతీతులు కారు. జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎమోషన్‌ కావడం సర్వసాధారణం. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. తన 30 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందంటూ ఎన్నికల కార్యాలయంలో భావోద్వేగానికి గురయ్యాడు. తాజాగా బీజేపీ ప్రకటించిన ఎంపీ స్థానాల్లో నరసాపురం స్థానం నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకు ఎంపీ సీటు దక్కడంపై శ్రీనివా వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ టికెట్ ప్రకటించిన వెంటనే పార్టీ కార్యాలయంలో కమలం పువ్వు గుర్తుపై అమాంతం పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదిలా ఉంటే ఈ విషయమై మాట్లాడిన భూపతి రాజు 30 ఏళ్ల కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని అన్నారు. తన జీవితం కమాలినకే అంకితం అంటూ ఎమోషనల్‌ అయ్యారు. కాగా నరసాపురం సీటు విషయంలో మొదటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. తనకు కచ్చితంగా సీటు వస్తుందని సిట్టింగ్‌ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి అధిష్టానం భూపతి రాజుకు సీటు ప్రకటించింది.

Related Posts