భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ నిలిచిపోయింది. 16 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. భారత బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో సఫారీ బ్యాట్స్‌మన్ ఎల్గర్ హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. పిచ్‌పై బంతి బౌన్స్ అవుతుండటంతో బ్యాట్స్‌మన్ ఇబ్బందులు పడ్డారు. దాంతో మ్యాచ్ రిఫరీ అంపైర్లతో కలిసి పిచ్‌ను పరిశీలించారు. ఇరుజట్ల కెప్టెన్లతో రిఫరీ, అంపైర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. పిచ్ తయారీ విషయంలో కోహ్లి ఆగ్రహం వ్య్తక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో నిలిపివేయడంతో సునీల్ గవాస్కర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ చేసుంటే ఇలాగే చేసే వారా? అని సూటిగా ప్రశ్నించారు.
టీమిండియా నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా దిగిన ఎకె మార్కమ్ (4) పరుగులకే చేతులేత్తేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 8.3 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 17 పరుగులు చేయగా, ఇల్గర్ (11), ఆమ్లా (2) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. లక్ష్యాన్ని ఛేదించాలంటే సఫారీ జట్టు ఇంకా 224 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, భారత బౌలర్లలో షమీకి ఒక వికెట్ దక్కింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 80.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి అలౌట్ అయింది.