YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంకా జనసేన మూడు స్థానాలు పెండింగ్

ఇంకా  జనసేన మూడు స్థానాలు పెండింగ్

విజయవాడ, మార్చి  30
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో  తెలుగుదేశంపార్టీ – జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన తరపున  ప్రకటించాల్సిన మూడు స్థానాలు మాత్రమే పెండింగ్ ున్నాయి.  పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించారు.. అయితే, జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. కానీ, విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. ఇదే సమయంలో జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని కూడా పెండింగులో పెట్టింది.పెండింగ్‌లో ఉన్న సీట్లల్లో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటి వరకు ఏటూ తేల్చుకోలేకపోతోంది జనసేన పార్టీ.. మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుపై ఇంకా క్లారిటీకి రాలేదు.. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ కసరత్తు చేశారు.. అయినా ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ఫైనల్‌ చేసినట్టుగా కనిపించడంలేదు  మరో వైపు డైలామాలోనే బందరు పార్లమెంట్ సీటు వ్యవహారం ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆయన పేరును పెద్దగా పరిశీలించడం లేదు.  అంగ బలం, అర్ధబలం ఉన్న అభ్యర్థుల కోసం జనసేనాని గాలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్‌ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్‌ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్‌, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్‌లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.  సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్లు తేలింది. కానీ టీడీపీ నుంచి  మండలి బుద్ద ప్రసాద్ ను చేర్చుకుని ఆయనకు టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.  పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంత మందిని వెంట పెట్టుకుని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎవరికి వారు పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరఫునా మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది.

Related Posts