YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేసీ ఫ్యామిలీకి టీడీపీ షాక్

జేసీ ఫ్యామిలీకి టీడీపీ షాక్

అనంతపురం, మార్చి 30,
జేసీ దివాకర్‌ రెడ్డి ఫ్యామిలీకి టీడీపీ అధినేత చంద్రబాబు  షాకిచ్చారు. వారికి కేవలం ఒక టికెట్‌ మాత్రమే కేటాయించారు. అనంతపురం ఎంపీ టికెట్ ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌ రెడ్డి  ఆశించారు. అయితే.. తాజాగా విడుదల చేసిన లిస్ట్ లో ఆ టికెట్ ను అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించారు. అయితే.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్‌ దక్కింది. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 2019లో అనంత ఎంపీగా పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆయన తండ్రి దివాకర్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించారు. అయితే.. ఎంపీ టికెట్‌ కుదరకపోతే గుంతకల్, కల్యాణదుర్గంలో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని పవన్ కోరారు. అయితే.. గుంతకల్‌ టికెట్‌ గుమ్మనూరు జయరాంకు ఇచ్చారు చంద్రబాబు. కల్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో జేసీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందనే అంశంపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.జేసీ పవన్ కుమార్ రెడ్డి తండ్రి జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6 సార్లు విజయం సాధించారు. 1985 నుంచి 2009 ఎన్నికల వరకు ఓటమి లేకుండా ఆయన అక్కడ గెలుపొందారు. 2014లో జేసీ అనంతపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించగా.. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.అయితే.. 2019లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న.. తాడిపత్రి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరు వేసింది. మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.

Related Posts