గిరిజనులు, సామాన్యుల సమస్యలను తెదేపా విస్మరించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా కురుపాంలోని సంతకూడలిలో నిర్వహించిన బహిరంగ సబలో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడుతూ… కురుపాంలో గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానన్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేవన్నారు. గిరిజనులు, సామాన్యుల సమస్యలు టిడిపి పరిష్కరిస్తుందని భావించాను. కానీ తెలుగుదేశం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ప్రత్యేకహోదా ఇస్తా మన్న కేంద్రం మొండి చెయ్యి చూపిస్తుంది. ఓట్లకోసం మాత్రమే రాజకీయ పార్టీలు వొస్తున్నాయి తప్ప గిరిజనులు, ప్రజల పట్ల అభిమానము లేదు. కురుపాం లో వైద్య సౌకర్యాలు లేవు, రోడ్లు లేవు, గిరిజనుల ఉత్పత్తులు కొనుగోలు చేయడం లేదు, ఉత్పత్తులు నిలువు చేయడానికి గిడ్డంగులు లేవని అన్నారు. అవసరమైన చోట వంతెనలు నిర్మించి గిరిజనులను మైదాన ప్రాంతాలకు రానివ్వడం లేదు. మండలాన్ని కలిపే పూర్ణపాడు లబెసు వంతెన నిర్మించలేక పోతున్నారు. కానీ మహానాడు చేసుకోడానికి మంచినీళ్లు లా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రులు తిరగడానికి రోడ్లు వేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన రీతిలో ప్రత్యేక హోదా అడిగి సాదించలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు మొదట్లోనే చేయి ఉంటే,, జనసేనతో కలిసి పయనించి ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా సాదించుకునేవారమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం కృషిచేయక పోవడంతో ఇప్పుడు యువత, గిరిజనులు, కార్మికులు ఎంతో నష్ట పోయారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోక పోవడం వల్ల విజయనగరం జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. జనసేన కార్యకర్తలు పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించండి. సమస్యలు తెలుసుకోండి, నా దృష్టికి తెండి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పోరాడతాను. మంచి నీరు వెళ్లలేని ప్రాంతాల్లోకి కూల్డ్రింక్స్, మద్యం వెళ్తుంది. ప్రభుత్వం వద్ద గిరిజనాభివృద్ధి కి ఎంతో డబ్బు ఉంది. కానీ వాటిని ఖర్చు చేయాలన్న ధ్యాస లేదని మండిపడ్డారు