తిరుమల
తిరుమల అలిపిరి నడక మార్గంలో వన్యమృగాల కదలికలు గుర్తించేందుకు 200 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డిఎఫ్ఓ సతీష్ తెలిపారు. మార్చి నెల 4వ తేదీ నుంచి ఇప్పటికీ ఐదు సార్లు మెట్ల మార్గానికి దగ్గరగా చిరుత, ఎలుగుబంటి సంచారం గుర్తించామని, వన్యమృగాల జాడ కు సంభందించి 4జీ నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ ద్వారా ఎప్పటి కప్పుడు ఫుటేజ్ వస్తోందన్నారు. చిరుతలు, ఎలుగు బంట్లు సంచారాన్ని గుర్తించిన్నప్పుడు వెంటనే భక్తుల రక్షణ కోసం అటవీ శాఖ, టీటీడీ సిబ్బంది చర్యలు చేపడుతున్నామని అన్నారు. అలిపిరి మెట్లమార్గంలోని గాలిగోపురం నుంచి నరసింహ ఆలయం వరకు రాత్రి సమయాల్లో భక్తులను గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.