YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొల్లాపూర్ అటవీశాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ బిజెపి ఎస్టి మోర్చా మహాధర్నా

కొల్లాపూర్ అటవీశాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ బిజెపి ఎస్టి మోర్చా మహాధర్నా

కొల్లాపూర్
కొల్లాపూర్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని అటవీశాఖ అధికారులు ఏటువంటి సమాచారం లేకుండా విగ్రహాన్ని ధ్వంసం చేసి అటవీ శాఖ కార్యాలయంలో విగ్రహాన్ని ఉంచారు, మా విగ్రహం మాకు కావాలని అటవీశాఖ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్టీ మోర్చా  ధర్నా్ఎ దిగింది.  ఈ కార్యక్రమంలో మోర్చా న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గోన్నారు.
డాక్టర్ కళ్యాణ్ నాయక్  మాట్లాడుతూ....కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు  మీకు గిరిజనులు ఓట్లేస్తేనే అధికారంలో వచ్చాము అన్న సోయి తప్పి బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ యొక్క విగ్రహం పైన పాషవిక దాడి చేసి, విగ్రహాన్ని ధ్వంసం చేసి, విగ్రహాన్ని ఎత్తుకెళ్లి ఫారెస్ట్ ఆఫీసులో పెట్టడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
సంత్ శ్రీ సెవలాల్ మహారాజ్ విగ్రహాన్ని తొలగించారు ఆ సేవాలాల్ ప్రాణంలో సేవాలాల్ భావ్య మందిరాన్ని ప్రభుత్వమే నిర్మించి దాన్ని రక్షణగా పోలీస్ ప్రొటక్షన్ కల్పించాలి. సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని తొలగించిన అధికారుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, దేశద్రోహం కేసు నమోదు చేసి బంజారాల దైవాన్ని కుట్రపూరీతంగా తొలగించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన అన్నారు.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించి భవ్యమైన మందిరం ఏర్పాటు అయ్యేంతవరకు పోరాడుతూనే ఉంటాం , లేనిపక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.

Related Posts