YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

బీజేపీని నిరాశ మిగిల్చిన ఉప ఎన్నికలు

బీజేపీని నిరాశ మిగిల్చిన ఉప ఎన్నికలు
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ ఉపఎన్నికలు బిజెపిని పెద్ద దెబ్బ కొట్టి నిరాశ మిగిల్చాయి. దేశవ్యాప్తంగా 11 శాసనసభ స్థానాలకు, 4 లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు కేవలం ఒక శాసనసభ స్థానంలోనూ, ఒక లోక్ సభ స్థానంలోనూ బిజెపి విజయం సాధించింది..ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయి. దాంతో పాటు ఓట్లు చీలకపోవడం కుడా తోడయింది. మోత్తానికి బీజేపీ పయనం కష్టమయిందనే చెప్పాలి.  
 బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లోని  కైరానా లోక్ సభ ఉపఎన్నిక దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఇక్కడ. రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి తబస్సుమ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ మరణంతో కైరానా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ తరపున సింగ్ కుమార్తె మృగాంక సింగ్ పోటీ చేశారు. తబస్సుమ్ కు బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీలు మద్దతు ఇచ్చాయి. నూర్పూర్ శాసనసభ స్థానాన్ని కుడా బిజెపి కోల్పోయింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ నుంచి రాజేంద్ర గవిత్ పోటీ చేయగా, శివసేన నుంచి శ్రీనివాస్ వనాగ బరిలోకి దిగారు.  మరోవైపు మేఘాలయ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆ పార్టీ గవర్నర్ ను కోరనున్నది. బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ ఘనవిజయం సాధించింది. జోకిహట్ నియోజకవర్గంలో జేడీయూకి 37,913 ఓట్లు రాగా ఆర్జేడీ 76,002 ఓట్లతో జయకేతనం ఎగరేసింది.
లోక్ సభ
మహారాష్ట్ర – పాల్ఘర్ – గవిట్ రాజేంద్ర – బిజెపి
ఉత్తర్ ప్రదేశ్ – కైరానా – తబస్సమ్ – ఆర్ఎల్డి
మహారాష్ట్ర – భాంద్రా గోండియా – కుకడే ఎం యశ్వంత్ రావు – ఎన్సిపి
నాగాలాండ్ – టొకెహో – ఎన్డిపిపి
శాసనసభ 
మేఘాలయ – అంపతి – మియానీ డి షిరా – కాంగ్రెస్
ఉత్తర్ ప్రదేశ్ – నూర్పూర్ – నయూమ్ ఉల్ హసన్ – ఎస్పి
కర్టాటక– ఆర్ ఆర్ నగర్ – మునిరత్న – కాంగ్రెస్
బీహార్ – జోకీహాట్ – షానవాజ్ – ఆర్జెడి
జార్ఖండ్ – గోమియా – బబితా దేవి – జెఎంఎం
జార్ఖండ్ – సిల్లి – సీమాదేవి – జెఎంఎం
పశ్చిమ బెంగాల్ – మహెస్తలా – దులాల్ చంద్రదాస్ – టిఎంసి
పంజాబ్ – షాకోట్ – హర్దేవ్ సింగ్ – కాంగ్రెస్
కేరళ – చెంగన్నూర్ – సజి చెరియన్ – సిపిఎం
మహారాష్ట్ర – పాలస్ కడేగావ్ – విశ్వజిత్ పతంగ్రావు – కాంగ్రెస్
ఉత్తరాఖండ్ – థరాలి – మున్ని దేవి షా – బిజెపి

Related Posts