YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మలుపులు తిరుగుతున్న వలంటీర్ల వ్యవహారం

మలుపులు తిరుగుతున్న వలంటీర్ల వ్యవహారం

విజయవాడ,  ఏప్రిల్ 1 
ఆంధ్రప్రదేశ్‌లో   వాలంటీర్ల వ్యవస్థ పై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ధనం ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో వీరిని దూరంగా ఉంచాలనే వరకు పరిస్థితి వెళ్ళింది. ఫిర్యాదుల పరిశీలన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం కూడా తీవ్రంగానే స్పందించింది. ఎన్నికల వేళ వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇది పరిపాలన వ్యవహారమే. దీంతో ఎన్నికల్లో గ్రామ సచివాలయ వాలంటీర్లు సేవలు అందించేందుకు అవకాశం లేకుండా పోయింది. తాజాగా ఎన్నికల సంఘం వారికి ఇచ్చిన ఫోన్‌లు, ట్యాబ్‌లు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. దీంతో వారితో రాజీనామాలు చేయించి.. ఎన్నికలకు వాడుకోవాలని వైసీపీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు సూచనలు పంపింది. వైసీపీ  వాలంటీర్లను  ఎన్నికలకు ఉపయోగించుకునేందుకు ఆటంకాలు ఏర్పడుతూంటంతో గ్రామ సచివాలయ వాలంటీర్లను వ్యూహాత్మకంగా రాజీనామాల బాట పట్టిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు వాలంటీర్లు రాజీనామాలకు సంసిద్ధమయ్యారు.  అధికారంలోకి రాగానే సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2019 అక్టోబర్ 2వతేదీన వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టారు. అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత 2021 అక్టోబర్‌లో 15,004 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 32 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటన్నిటి పరిధిలో ఇంటి ముంగిటకే పరిపాలన తీసుకువచ్చింది. అన్ని విభాగాలు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలో 1,26,649 నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 3.2 కోట్ల మందికి ప్రభుత్వ పథకాలు అందించడానికి వీలుగా 50 ఇండ్లకు ఒకరిని కేటాయిస్తూ రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేయడానికి 2,54,832 వాలంటీర్లు నియమితులయ్యారు.గ్రామ సచివాలయల ద్వారా ప్రజలకు పథకాలు, అందుతున్నాయి. చాలాచోట్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని ఇతరత్రా కార్యక్రమాలు సాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయడమే కాకుండా, పార్టీకి ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారు ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.   " మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తొలగించం. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఉపేక్షించే సమస్యే లేదని విపక్ష నేతలు వాలంటీర్లను హెచ్చరించారు. తామ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు వేల గౌరవ వేతనాన్ని రూ.50 వేలు సంపాదించుకునే రీతిలో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పిస్తాం’’ అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  ఎన్నికల కమిషన్ ఆంక్షలతో .. వైఎస్ఆర్సిపి నాయకుల్లో కొత్త ఆలోచనకు తెర తీసింది. ఎలాగో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని ధీమాతో వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే గ్రామాల్లో ఉన్న వార్డు సచివాలయ వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. వార్డు ఏజెంట్లుగా కూర్చుంటారని ప్రకటించారు. కొన్ని చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేయడానికి నిరాకరిస్తే.. వారితో  బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు.  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వాలంటీర్లు రాజీనామా చేసి రావాలని ఒత్తిడి చేస్తున్నారు.  మళ్లీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తుంది, మళ్లీ మిమ్మల్ని తీసుకుంటాం అని భరోసా ఇస్తున్నారు. ఒక్క సారి రాజీనామా చేశారు అంటే.. ఇక వాలంటీర్ కానట్లే. వైసీపీకి పని చేసుకోవచ్చు.. చేయకపోవచ్చు.. ప్రభుత్వం వస్తే మళ్లీ వారికి వాలంటీర్ పోస్ట్ ఇస్తారు. మరి ప్రభుత్వం మారితే. ఏదీ రాదు. ఉన్న  అవకాశం పోయినట్లవుతుంది. ఎందుకంటే ఉన్న వాలంటీర్ల సంక్షేమం చూసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. రాజీనామాలు చేసి..వైసీపీ కోసం పని  చేసిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా.. చేసినతప్పులకు కేసులు పెట్టినా ఆశ్చర్యం ఉండదు. అందుకే వాలంటీర్ల వ్యవహారం ఏపీలో  మలుపులు తిరుగుతోంది.  

Related Posts